దొంగతనం కేసులో మూడేళ్ల తర్వాత ట్విస్ట్.. దొంగిలించిన చీరే పట్టించింది!
మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసును ఓ చీర బట్టబయలు చేసింది. దొంగిలించిన చీరను ఫంక్షన్కు కట్టుకుని వచ్చిన మహిళను బాధితురాలు గుర్తించడంతో పోలీసులు దంపతులను అరెస్టు చేశారు.
దొంగిలించిన చీరే దొంగలను పట్టించింది! మూడేళ్ల క్రితం జరిగిన ఇంటి దొంగతనం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దొంగతనం చేసిన చీరను ఓ మహిళ ఫంక్షన్కు కట్టుకుని రావడంతో.. దాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా.. మూడేళ్ల క్రితం తామే దొంగతనం చేసినట్లు అంగీకరించారు.
ఫంక్షన్లో కనిపించిన చీరతో..
బండ్లగూడ జాగీర్లోని వినాయకనగర్ ప్రాంతంలో యాదయ్య తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 16న యాదయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సెప్టెంబర్ 19న తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని రూ.2.50 లక్షల నగదు, 9 తులాల బంగారం, పలు చీరలు కనిపించకపోవడంతో యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేసు నమోదైంది. ఈ ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయాయి. దొంగలు ఎవరో ఎంతకీ తెలియలేదు.
అయితే, ఇటీవల ఓ ఫంక్షన్కు వెళ్లిన యాదయ్య భార్యకు ఊహించని పరిచయం ఎదురైంది. తమ ఇంటి వెనుక నివసించే స్వప్న (29) అనే మహిళ కట్టుకున్న చీరను చూసిన ఆమె ఒక్కసారిగా గుర్తుపట్టారు.“ఇది మా ఇంట్లో దొంగిలించిన చీరే” అని నిర్ధారించుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్వప్నతో పాటు ఆమె భర్త రాములు (35)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తొలుత ఆ చీర తనదేనంటూ స్వప్న బుకాయించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరకు అసలు విషయం బయటపడింది.
2023లో యాదయ్య ఇంట్లో జరిగిన దొంగతనానికి తామే పాల్పడ్డామని స్వప్న, రాములు దంపతులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో స్వప్న, రాములుపై దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మూడేళ్లుగా పరిష్కారం కాని కేసులో.. చివరకు ఓ చీరే కీలక ఆధారంగా మారి దొంగలను పోలీసులకు పట్టించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

