– నకిరేకల్ ఏఈఓ షేక్ హిదయతుల్లా
నకిరేకల్, సెప్టెంబర్ 24 : ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 నుండి 30వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గురువారం నెల్లిబండ గ్రామంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దీని కోసం ఆగస్టు 13వ తారీఖు 2026 వరకు రిజిస్ట్రేషన్లు జరిగిన పట్టాదారులు అందరూ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని నకిరేకల్ ఏఈఓ షేక్ హిదయతుల్లా తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం వల్ల FFS యాప్ నుండి ఎరువుల కొనుగోలు, బ్యాంకు నుండి క్రాప్ లోను పొందుటకు అలాగే ప్రభుత్వం రైతులకు ఇచ్చే ఎటువంటి పథకాన్ని లబ్ధి పొందాలన్నా కూడా ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆడెపు రాఘవులు, వార్డు మెంబర్ బొడ్డుపల్లి లక్ష్మీనరసయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.