బూర్గంపహాడ్, సెప్టెంబర్ 24 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో కొలువైన షిరిడీ పుష్కర సాయిబాబా ఆలయానికి ఇరవెండికి చెందిన తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.3.5 లక్షల విలువైన రథాన్ని గురువారం బహుకరించారు. ట్రస్టు చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య, ట్రస్టు డైరెక్టర్ వల్లూరిపల్లి వంశీకృష్ణ, విజయరేణుక దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తమ కుమారుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్-నీలిమ దంపతుల సౌజన్యంతో స్వామివారికి రథం అందించినట్లు ట్రస్టు చైర్మన్ తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు పంచారక్షయ్యను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగమనేని భాస్కరరావు, తీగల జీవన్‌రెడ్డి, ఊటుకూరి రమణమూర్తి, అక్కెర భాస్కరచారి, కొత్తపల్లి సత్యనారాయణ, రామారావు పాల్గొన్నారు.

షిరిడీ పుష్కర ద్వారక సాయిబాబా ఆలయానికి రథం బహూకరణ