Sai Dharam Tej | ‘ఆ రోజు నాకు రెండో జీవితం దక్కింది’.. ఐదేళ్ల క్రితం ప్రమాదాన్ని గుర్తుచేసుకున్న సాయి దుర్గా తేజ్
Sai Dharam Tej | మెగా హీరో సాయి దుర్గా తేజ్ జీవితంలో 2021 సెప్టెంబర్ నెలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి చికిత్స తీసుకున్నారు. ప్రమాదం నుంచి క్రమంగా కోలుకుని మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆ ప్రమాదం జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సాయి దుర్గా తేజ్ చేసిన భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sai Dharam Tej | మెగా హీరో సాయి దుర్గా తేజ్ జీవితంలో 2021 సెప్టెంబర్ నెలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి చికిత్స తీసుకున్నారు. ప్రమాదం నుంచి క్రమంగా కోలుకుని మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆ ప్రమాదం జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా సాయి దుర్గా తేజ్ చేసిన భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐదేళ్ల క్రితం ఇదే రోజున తనకు జీవితంలో రెండో అవకాశం లభించిందని సాయి దుర్గా తేజ్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు అందించిన అండ తన కోలుకునే ప్రయాణంలో ఎంతో కీలకంగా నిలిచిందని చెప్పారు. వారి ప్రేమ, ప్రార్థనలు, సందేశాలు తనకు కష్టమైన రోజుల్లో ముందుకు సాగేందుకు బలాన్ని ఇచ్చాయని గుర్తుచేసుకున్నారు.
ప్రమాదంలో ఎదురైన గాయాల నుంచి తాను దాదాపు 90 శాతం వరకు కోలుకున్నానని సాయి దుర్గా తేజ్ తెలిపారు. అయితే మాటతీరు సహా కొన్ని విషయాల్లో ఇంకా పూర్తిగా మెరుగుపడేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రతిరోజూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కోలుకుంటున్నానని పేర్కొన్నారు. కష్టమైన ప్రతి రోజు, ఎదురుదెబ్బ తగిలిన ప్రతి సందర్భం, వదిలేయడం సులభంగా అనిపించిన ప్రతి క్షణంలోనూ మీ ప్రేమే నాకు బలాన్ని ఇచ్చింది. ఐదేళ్ల తర్వాత కూడా నేను నిలబడి ఉన్నాను. పోరాడుతున్నాను. జీవిస్తున్నాను అనే భావాన్ని ఆయన తన పోస్ట్‌లో వ్యక్తం చేశారు. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారికి, ప్రతి సందేశం ద్వారా ప్రేమను పంచుకున్నవారికి సాయి దుర్గా తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి అభిమానుల ప్రేమ కూడా ఒక ముఖ్యమైన కారణమని చెప్పారు.
తన ప్రమాదం నుంచి అందరూ ఒక విషయాన్ని నేర్చుకోవాలని సాయి దుర్గా తేజ్ సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. హెల్మెట్ ధరించడం చిన్న నిర్ణయంలా కనిపించినా.. ప్రాణాలను కాపాడటంలో అది ఎంతో కీలకమని తన అనుభవం ద్వారా చెప్పారు.ప్రమాదం తర్వాత సాయి దుర్గా తేజ్ మళ్లీ సినిమాల్లోకి రావడం కూడా అభిమానుల్లో ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు ఆయన వరుసగా సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇక సాయి దుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’. రోహిత్ కేపీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జగపతి బాబు, ఐశ్వర్య లక్ష్మి, శ్రీకాంత్, సాయి కుమార్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నటుడు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెట్రివేల్ పళనిస్వామి ఛాయాగ్రహణం అందిస్తుండగా.. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. భారీ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

