Dr. Raji Reddy | స్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించాలి : డా. రాజి రెడ్డి
రైతులు పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణకే పరిమితం కాకుండా, వాటి అధిక వినియోగాన్ని నివారించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా. డి. రాజి రెడ్డి అన్నారు.
Dr. Raji Reddy | మిరప, ఇతర సుగంధ ద్రవ్యాల వంటి అధిక విలువ కలిగిన పంటల్లో రైతులు పురుగుమందులను విచక్షణారహితంగా వినియోగించడం ఆందోళనకరమని, పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణకే పరిమితం కాకుండా, వాటి అధిక వినియోగాన్ని నివారించే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డా. డి. రాజి రెడ్డి అన్నారు.
ఐసీఏఆర్ (ICAR), న్యూఢిల్లీ ఆధ్వర్యంలోని అఖిల భారత పురుగుమందుల అవశేషాలు , కలుషిత పదార్థాల పర్యవేక్షణ నెట్వర్క్ ప్రాజెక్టు (AINP-PR&C) నిర్వహించిన 18వ జాతీయ స్థాయి పురుగుమందుల అవశేషాల పర్యవేక్షణ వార్షిక కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ICAR-IIHR) జి.ఎస్. రంధావా ఆడిటోరియంలో ఈ కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన డా. రాజిరెడ్డి, ఉద్యాన పంటలతో పాటు మొత్తం ఆహార సరఫరా వ్యవస్థలో పురుగుమందుల అవశేషాల సమాచారాన్ని సేకరించడం, వివిధ భాగస్వామ్య సంస్థలను సమన్వయం చేయడంలో AINP-PR&C చేస్తున్న కృషిని అభినందించారు.
డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఖచ్చితత్వ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలను వినియోగించడం ద్వారా అవసరానికి అనుగుణంగా పురుగుమందులను వాడాలన్నారు. పంటల్లో రసాయన అవశేషాలను తగ్గించి, ఆహార భద్రతను పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు పురుగుమందుల సముచిత వినియోగం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించాలని కూడా సూచించారు. ఈ సమావేశానికి బెంగళూరులోని ICAR-IIHR సంచాలకులు డా. టి.కె. బెహరా అధ్యక్షత వహించారు. దేశంలోని వివిధ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dr. Raji Reddy | స్మార్ట్ వ్యవసాయ సాంకేతికతలను ప్రోత్సహించాలి : డా. రాజి రెడ్డి
Fire accident | ఫ్లైఓవర్ కింద చెత్తకుప్పకు అంటుకున్న నిప్పు.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు.. Video
Ranabaali | ఓటీటీలో విజయ్ దేవరకొండ ‘రణబాలి’ రికార్డుల వేట.. కేవలం 10 రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లోకి!
NTR | ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.. పదేళ్ల తర్వాత కామెడీ యాంగిల్లో తారక్, అనిల్ రావిపూడి అదిరిపోయే హామీ!
BRS | బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల హత్యాయత్నం
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

