BRS | బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల హత్యాయత్నం
తీగలపల్లి గ్రామ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కన్నా రెడ్డి భాస్కర్ రెడ్డి పై గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు దుండగులు కంట్లో కారం చల్లి కర్రలతో దాడి చేశారు.
కొల్లాపూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ గుండాల అరచాకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం తీగలపల్లి గ్రామ బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కన్నా రెడ్డి భాస్కర్ రెడ్డి పై గురువారం ఉదయం అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు దుండగులు కంట్లో కారం చల్లి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భాస్కర్ రెడ్డిని రోడ్డుపై వస్తున్న కొందరు గమనించి గ్రామస్తుకు సమాచారం అందించారు. వెంటనే అతన్ని 108 వాహనంలో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి తరలించారు.
తీగలపల్లి గ్రామానికి చెందిన కురువ పెద్ద బిచ్చయ్య, తెలుగు బాల చంద్రయ్య, తెలుగు వీరభద్రయ్య, తెలుగు ఆంజనేయులు అనే వ్యక్తులు భాస్కర్ రెడ్డి గురువారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో వాకింగ్ చేస్తుండగా దారి కాచి కంట్లో కారం చల్లి కర్రలతో దాడి చేశారు. రక్తం మడుగులో పడి ఉన్న భాస్కర్ రెడ్డి చనిపోయాడని భావించిన దుండగులు చెట్ల పొదల్లో భాస్కర్ రెడ్డిని పడేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | బీఆర్ఎస్ నాయకుడు భాస్కర్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల హత్యాయత్నం
Theatre | నాలుగు దశాబ్దాల సినీ చరిత్రకు ముగింపు.. చెన్నైలో కనుమరుగు కానున్న ఐకానిక్ ఆల్బర్ట్ థియేటర్!
Egypt | ఈజిప్టులో ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 31 మంది మృతి
Ravi Teja | రవితేజ సినిమా షూటింగ్లో కలకలం.. జీహెచ్ఎంసీ ఉద్యోగినంటూ రూ.30 వేలు డిమాండ్.. !
Road accident | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

