Egypt | ఈజిప్టులో ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 31 మంది మృతి
Egypt | ఈజిప్ట్ రాజధాని కైరో( Cairo)సమీపంలోని గిజా గవర్నరేట్ రింగ్ రోడ్ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడి(Petrol tanker explosion) పేలడంతో 31 మంది మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు.
Egypt | ఈజిప్ట్ రాజధాని కైరో( Cairo)సమీపంలోని గిజా గవర్నరేట్ రింగ్ రోడ్ హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తాపడి(Petrol tanker explosion) పేలడంతో 31 మంది మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రేటర్ కైరోలో కీలకమైన రహదారులను కలిపే రద్దీగా ఉండే రింగ్ రోడ్డు హైవేపై వెళ్తున్న ఇంధన ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడటంతో పెట్రోల్ ఒలికి భారీగా మంటలు చెలరేగాయి.ఈ మంటల్లో 20కి పైగా కార్లు, ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని స్థానిక ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
అగ్నిమాపక సహాయక బృందం అక్కడికే చేరుకుని మంటలను ఆర్పేసరికే 31 మంది మృతి చెందారు. ప్రజలు రోడ్ల పైకి భారీగా చేరుకోవడంతో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది.ట్యాంకర్ ముందు హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని సోషల్ మీడియాలో పలు కథనాలు వెలవడ్డాయి. అయితే ఈ వార్తలను ఈజిప్ట్ రవాణా మంత్రిత్వ శాఖ అధికారికంగా ఖండించింది.
కాగా, ఈజిప్టులో తరచుగా రోడ్డు ప్రమాదలు జరగడం పరిపాటిగా మారింది. సరైన రోడ్లు లేకపోవడం, అక్రమ నివాసాలు వంటి వాటితో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత సంవత్సరం దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో దాదాపు 6,000 మంది మరణించారు. ఈ క్రమంలో ఈజిప్ట్ కొత్త రహదారులు, వంతెనలను నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టులు కొన్ని ప్రాంతాలలో ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరిచినప్పటికీ, రహదారి భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Egypt | ఈజిప్టులో ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 31 మంది మృతి
Ravi Teja | రవితేజ సినిమా షూటింగ్లో కలకలం.. జీహెచ్ఎంసీ ఉద్యోగినంటూ రూ.30 వేలు డిమాండ్.. !
Road accident | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
Hanuman Ansh | నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘హనుమాన్ అంశ్’.. ఐదు భాషల్లో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
AP panchayat elections | ఏపీలో ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

