Theatre | నాలుగు దశాబ్దాల సినీ చరిత్రకు ముగింపు.. చెన్నైలో కనుమరుగు కానున్న ఐకానిక్ ఆల్బర్ట్ థియేటర్!
Theatre | సినిమా థియేటర్లకు ఒకప్పుడు ప్రేక్షకులతో కళకళలాడిన రోజులు ఉండేవి. తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచా వేడుకలతో సందడి నెలకొనేది. అయితే కాలం మారడంతో పాటు ప్రేక్షకుల సినిమా చూసే విధానంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి.
Theatre | సినిమా థియేటర్లకు ఒకప్పుడు ప్రేక్షకులతో కళకళలాడిన రోజులు ఉండేవి. తమ అభిమాన హీరో సినిమా విడుదలవుతుందంటే థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణాసంచా వేడుకలతో సందడి నెలకొనేది. అయితే కాలం మారడంతో పాటు ప్రేక్షకుల సినిమా చూసే విధానంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి రావడం, కరోనా తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గడంతో ఎన్నో పాత సినిమా హాళ్లు కనుమరుగయ్యాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి చెన్నైలోని ప్రముఖ ఆల్బర్ట్ థియేటర్ కూడా చేరనుంది.
చెన్నై మహానగరంలోని ఎగ్మోర్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ఆల్బర్ట్ థియేటర్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు వేదికగా నిలిచిన ఈ థియేటర్ ఇకపై కనిపించనుంది. ఇప్పటికే చెన్నై నగరంలో అనేక పురాతన థియేటర్లు మూతపడటమే కాకుండా, వాటి స్థానంలో ఇతర భవనాలు నిర్మించారు. ఇప్పుడు అదే పరిస్థితి ఆల్బర్ట్ థియేటర్‌కు ఎదురుకానుంది. కరోనా మహమ్మారి తర్వాత ప్రేక్షకుల సినిమా చూసే అలవాట్లలో భారీ మార్పులు వచ్చాయి. గతంలో కొత్త సినిమా విడుదలైతే తప్పనిసరిగా థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులు.. ఇప్పుడు ఓటీటీల్లో సినిమా విడుదలయ్యే వరకు వేచి చూస్తున్నారు. ఇంట్లోనే తమకు నచ్చిన సినిమాలను కుటుంబ సభ్యులతో కలిసి చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు థియేటర్ల నిర్వహణ ఖర్చులు, ప్రేక్షకుల ఆదరణ తగ్గడం వంటి కారణాలు కూడా పాత సినిమా హాళ్ల మనుగడపై ప్రభావం చూపుతున్నాయి.
ఈ పరిణామాలతో చెన్నైలో అబిరామి, శాంతి, నాగేష్, సఫైర్, గెయిటీ, వెల్లింగ్టన్, రాక్సీ, మేఘల, భువనేశ్వరి, చిత్ర, కబాలి, ఉమ, రాజకుమారి, పారగన్, ప్లాజా, నేషనల్, వాణి, వసంతి, ఆనంద్, లియో, అలంకార్, పైలెట్, ప్రసాద్, మోక్షం, రామ్, జయప్రద, లిబర్టీ, మెలోడీ, బ్రాడ్వే తదితర ఎన్నో థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. ఇప్పుడు ఆల్బర్ట్ థియేటర్ కూడా అదే బాటలో పయనిస్తోంది.ఆల్బర్ట్ థియేటర్‌కు తమిళ సినీ పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఎన్నో సినిమాలు ఈ థియేటర్లో విడుదలై ఘన విజయాలను అందుకున్నాయి. కొన్ని చిత్రాలు వంద రోజులకు పైగా ప్రదర్శితమై శతదినోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నాయి. దీంతో రజనీ అభిమానులకు ఈ థియేటర్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.
ఈ సినిమా కాంప్లెక్స్‌లో ప్రధాన ఆల్బర్ట్ థియేటర్లో 1,200 సీట్ల సామర్థ్యం ఉండగా, బేబీ ఆల్బర్ట్ థియేటర్లో 240 సీట్లు ఉన్నాయి. ఇలా మొత్తం 1,440 సీట్ల సామర్థ్యంతో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులకు సేవలందించిన ఈ కాంప్లెక్స్‌లో చివరిగా విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత థియేటర్ ప్రాంగణాన్ని మూసివేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Theatre | నాలుగు దశాబ్దాల సినీ చరిత్రకు ముగింపు.. చెన్నైలో కనుమరుగు కానున్న ఐకానిక్ ఆల్బర్ట్ థియేటర్!
Egypt | ఈజిప్టులో ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 31 మంది మృతి
Ravi Teja | రవితేజ సినిమా షూటింగ్లో కలకలం.. జీహెచ్ఎంసీ ఉద్యోగినంటూ రూ.30 వేలు డిమాండ్.. !
Road accident | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
Hanuman Ansh | నెట్‌ఫ్లిక్స్‌లోకి ‘హనుమాన్ అంశ్’.. ఐదు భాషల్లో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

