లక్నో: ఒక వ్యక్తి తన మాజీ ప్రియురాలికి బలవంతంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ప్రతిఘటించిన ఆమె అతడి నాలుక కొరికింది. నాలుక కొంత భాగం తెగడంతో రక్తం కారింది. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Ex-Girlfriend Bites Off Man’s Tongue) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 35 ఏళ్ల ఛాంపి వివాహితుడు. అతడికి ఒక ప్రియురాలు ఉన్నది. ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది.
కాగా, ఆ మహిళకు ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈ నేపథ్యంలో ఛాంపికి ఆమె దూరంగా ఉంటున్నది. అయితే ఎడబాటును భరించలేని అతడు ఆ మహిళను కలిసేందుకు ప్రయత్నించాడు. నవంబర్ 17న ఒక చెరువు వద్ద ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. బ్రేకప్ చెప్పిన మాజీ ప్రియురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బలవంతంగా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఛాంపి నాలుకను గట్టిగా కొరికింది. దీంతో అతడి నాలుకలో కొంతభాగం తెగింది.
మరోవైపు తీవ్రంగా రక్తం కారడంతో ఆ బాధతో ఛాంపి కేకలు పెట్టాడు. గమనించిన స్థానికులు అతడి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. తొలుత స్థానిక ఆరోగ్య కేంద్రానికి ఛాంపిని తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మాజీ ప్రియురాలి ఫిర్యాదుతో ఆమెను లైంగికంగా వేధించిన ఛాంపిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Boy Trapped In Car Dies | ఆడుకుంటూ కారులో చిక్కుకున్న బాలుడు.. రెండు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు
Watch: కొత్తగా కొనుగోలు చేసిన థార్‌లో సమస్యలు.. షోరూమ్‌కు లాక్కెళ్లిన గాడిదలు