ముంబై: ఒక వ్యక్తి థార్ కొనుగోలు చేశాడు. అయితే ఆ వాహనంలో పలు సమస్యలు బయటపడ్డాయి. డీలర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో థార్‌ను గాడిదలకు కట్టి షోరూమ్‌కు లాక్కెళ్లాడు. (Donkeys Pull Thar) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. జున్నార్ ప్రాంతంలో నివసించే గణేష్ సంగ్డే కొన్ని నెలల కిందట మహీంద్రా కంపెనీకి చెందిన థార్ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. అయితే తొలి నుంచి ఆ వాహనంలో సమస్యలు ఎదురయ్యాయి. వాటర్ లీకేజీ, ఇంజిన్ నుంచి పెద్దగా శబ్దం రావడం వంటి సమస్యలతో అతడు ఇబ్బందులుపడ్డాడు.
కాగా, థార్‌లో సమస్యల గురించి గణేష్ పలుమార్లు డీలర్‌కు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో వినూత్నంగా నిరసన తెలిపాడు. డీలర్‌ను విమర్శిస్తూ థార్ చుట్టూ పెద్ద పోస్టర్లు ఏర్పాటు చేశాడు. ఆ వాహనాన్ని తాళ్లతో గాడిదలకు కట్టాడు. డప్పుల మధ్య వాకాడ్‌లోని సహ్యాద్రి మోటార్స్ షోరూమ్ వరకు థార్‌ను గాడిదలతో లాక్కెళ్లాడు. కొందరు వ్యక్తులు ఆ వాహనాన్ని తోశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Thar again but this time for a different reason. Pune Man uses donkeys to tow his thar to take it back to the showroom after repeated unresolved issues with its engine.@anandmahindrapic.twitter.com/LK5p9pGTce
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) November 14, 2025
Also Read:
Boy Trapped In Car Dies | ఆడుకుంటూ కారులో చిక్కుకున్న బాలుడు.. రెండు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు
Fake Nandini Ghee | నకిలీ ‘నందిని’ నెయ్యి రాకెట్ గుట్టురట్టు.. జంతువుల కొవ్వు వాడకంపై దర్యాప్తు