ENG vs PAK : సూపర్ 8 తొలిపోరులో శ్రీలంకను చిత్తు చేసిన ఇంగ్లండ్ రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్ పని పట్టింది. పల్లెకెలె స్టేడియంలో హ్యారీ బ్రూక్(100) చిరస్మరణీయ శతకంతో పాక్ బౌలర్లపై విరుచుకపడ్డాడు. ఛేదనలో 54కే నాలుగు వికెట్లు పడినా వెరవని బ్రూక్.. అటాకింగ్ గేమ్‌తో.. కీలక భాగస్వామ్యాలతో లక్ష్యాన్ని కరిగించాడు. విజయానికి పది పరుగుల దూరంలో అతడు ఔటైనా విల్ జాక్స్(28) లాంఛనం పూర్తి చేశాడు. గ్రూప్ బీ నాకౌట్ దశలో రెండు వరుస విజయాలతో ఇంగ్లండ్ సెమీస్‌కు దూసుకెళ్లగా.. పాక్ ఆశలు ఆవిరయ్యాయి.
మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్ నాకౌట్ దశలో చెలరేగి ఆడుతోంది. ఆతిథ్య శ్రీలంకను 51 పరుగులు తేడాతో ఓడించిన.. హ్యారీ బ్రూక్ సేన పాకిస్థాన్‌పైనా ప్రతాపం చూపింది. 165 పరుగుల ఛేదనలో 54కే నాలుగు వికెట్లు పడినా.. బ్రూక్ క్రీజునంటుకొని చిరస్మరణీయ శతకంతో మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పాడు. సామ్ కరన్(16), విల్ జాక్స్(28)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి.. మ్యాచ్‌ను పాక్ నుంచి లాగేసుకున్నాడు.
England are the first team through!
Harry Broook’s ton sees the team to their fifth consecutive men’s T20 World Cup semi-final 🔥 pic.twitter.com/DvEkhQwWWD
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2026
ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ఫిల్ సాల్ట్(0)ను అఫ్రిది గోల్డెన్ డక్‌గా ఔట్ చేసి షాకిచ్చాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న జోస్ బట్లర్(2)ను, జాకబ్ బెథెల్(8)ను ఔట్ చేసిన అఫ్రిది టాపార్డర్‌ను కూల్చి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలో పడేశాడు. 35కే మూడు వికెట్లు పడిన వేళ.. హ్యారీ బ్రూక్ (100) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాక్ బౌలర్లపై పైచేయి సాధించాడు. బ్యాంటన్ విఫలమైనా.. దూకుడుగా ఆడిన అతడు 28 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. సామ్ కరన్(16) జతగా కీలక భాగస్వామ్యం నెలకొప్పాడు. ఐదో వికెట్‌కు 28 బంతుల్లో 45 పరుగులు జోడించిన ద్వయాన్ని తారీక్ విడదీశాడు.
🚨 HARRY BROOK HUMBLED PAKISTAN 🚨
– Harry Brook just smashed Pakistan fair and squad at Kandy with magnificent match winning century 🔥
– England were 58/4, then Harry Brook carried on with 50 ball 100, smashing every Pakistani bowler 👏🏻#PAKvsENG pic.twitter.com/N9TKamvyCC
— Richard Kettleborough (@RichKettle07) February 24, 2026
లెగ్ సైడ్‌లో పెద్ద షాట్ ఆడిన కరన్ నేరుగా నవాజ్ చేతుల్లోకి క్యాచ్ ఇచ్చాడు. అనంతరం విల్ జాక్స్(28) జతగా.. బ్రూక్ గెలుపు బాధ్యత తీసుకున్నాడు. మిస్టరీ స్పిన్నర్ తారీఖ్ ఓవర్లో జాక్స్ సిక్సర్, బ్రూక్ ఫోర్ బాదడంతో సమీకరణం 24 బంతుల్లో 27 రన్స్‌కు చేరింది. ఆ తర్వాతి ఓవర్లోనే అఫ్రిదిని ఉతికేస్తూ జాక్స్ ఫోర్.. బ్రూక్ సిక్సర్‌తో శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి యార్కర్‌కు బ్రూక్ బౌల్డయ్యాడు. కానీ, అప్పటికే ఇంగ్లండ్ గెలుపు వాకిట నిలిచింది. 10 పరుగులే అవసరమవ్వగా.. నవాజ్ ఒకే ఓవర్లో జాక్స్, ఓవర్టన్ ఔట్ చేశాడు. ఆఖరి ఓవర్లో 3 రన్స్ కొట్టాల్సి రాగా.. ఆర్చర్ తొలి బంతికే బౌండరీ సాధించగా 2 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది.
తొలి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ ఐదు పరుగులే ఇవ్వగా.. రెండో ఓవర్లోనే సయీం ఆయూబ్(7)ను ఆర్చర్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. సారథి సల్మాన్ అఘా(5)ను ఓవర్టన్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ పంపాడు. అనంతరం ఓపెపర్ ఫర్హాన్(63)తో కలిసి బాబర్ ఆజాం(25) స్కోర్‌బోర్డును నడిపించాడు. వీర్దిదరూ ఆచితూచి ఆడుతూ 46 రన్స్ జోడించారు. బాబర్‌ను బౌల్డ్ చేసి కుదురుకున్న ఈ జోడీని జేమ ఓవర్టన్ విడదీశాడు.
Shadab Khan’s cameo lifts Pakistan towards the end, but do they have enough?
LIVE: https://t.co/2mLS1T71kz pic.twitter.com/rv08qUDzSP
— ESPNcricinfo (@ESPNcricinfo) February 24, 2026
అనంతరం.. ఫఖర్ జమాన్(23)తో కలిసి జోరు పెంచిన ఫర్హాన్ అర్ధ శతకంతో పాక్ స్కోర్ దాటించాడు. మిడిల్ ఓవర్లలో లియాం డాసన్(3-24) వికెట్ల వేటతో పాక్ భారీ స్కోర్ ఆశలకు చెక్ పెట్టాడు. అతడి విజృంభణతో 122/4తో ఉన్న పాక్ 25 పరుగుల వ్యవధిలోనే మరో నాలుగు వికెట్లు కోల్పోపోయింది. ఫలితంగా.. పాక్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నస్టానికి 164 పరుగులకే పరిమితమైంది.