చెన్నై: ఒక బాలుడు ఆడుకుంటూ కారులో చిక్కుకున్నాడు. ఆలయం ఉత్సవం శబ్దాలకు అతడి అరుపులు ఎవరికీ వినిపించలేదు. దీంతో ఊపిరాడక చనిపోయాడు. రెండు రోజుల తర్వాత ఆ కారులో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. (Boy Trapped In Car Dies) తమిళనాడులోని మదురై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 13న ఏడేళ్ల షణ్ముగవేలన్ తన కుటుంబంతో కలిసి నానమ్మ ఇంటికి వెళ్లాడు. ఆలయం ఉత్సవంతో ఆ ఊరు సందడిగా మారింది.
కాగా, షణ్ముగవేలన్ కొందరు పిల్లలతో కలిసి దాగుడుమూతలు ఆడాడు. పార్క్ చేసిన కారులో దాక్కున్నాడు. ప్రమాదవశాత్తు డోర్ లాక్ కావడంతో అందులో చిక్కుకున్నాడు. ఆలయం ఉత్సవం సందడి, శబ్దాల హోరులో ఆ బాలుడి గురించి ఎవరూ పట్టించుకోలేదు.
మరోవైపు షణ్ముగవేలన్ కనిపించకపోవడంతో ఆలయం ఉత్సవంలో అతడు తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ బాలుడి కోసం వెతికారు. చివరకు ఆ ప్రాంతం సమీపంలో పార్క్ చేసిన వాహనాలను పోలీసులు పరిశీలించారు. దీంతో రెండు రోజుల తర్వాత స్థానిక డాక్టర్‌కు చెందిన కారులో షణ్ముగవేలన్ మృతదేహాన్ని గుర్తించారు.
కాగా, పోస్ట్‌మార్టం నిర్వహించగా ఊపిరాడక ఆ బాలుడు మరణించినట్లు నిర్ధారణ అయ్యింది. ఆటలో భాగంగా కారులో దాక్కున్న షణ్ముగవేలన్, ప్రమాదవశాత్తు డోర్ లాక్ కావడంతో చిక్కుకుపోయి మరణించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Fake Nandini Ghee | నకిలీ ‘నందిని’ నెయ్యి రాకెట్ గుట్టురట్టు.. జంతువుల కొవ్వు వాడకంపై దర్యాప్తు
Bride To Be Killed By Fiance | పెళ్లికి గంట ముందు గొడవ.. కాబోయే భార్యను హత్య చేసిన కాబోయే భర్త
Women Trample Infant to Death | పెళ్లి కావడం లేదని.. పసిబిడ్డను కాళ్లతో తొక్కి చంపిన మహిళలు