జైపూర్: నలుగురు మహిళలు దారుణానికి పాల్పడ్డారు. తమకు పెళ్లిళ్లు కావడం లేదని పసిబిడ్డ ఉసురు తీశారు. అక్క కొడుకైన 16 రోజుల పసి బాబును కాళ్లతో తొక్కి చంపారు. శిశువు మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మంత్రాలు జపించారు. (Women Trample Infant Death) రాజస్థాన్లోని జోధ్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్కాచెల్లెళ్లైన నలుగురు మహిళలకు పెళ్లిళ్లు కాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. గ్రామ దేవతకు శిశివును బలి ఇస్తే తమకు వివాహాలు జరుగుతాయని వారు నమ్మారు. అక్క కుమారుడైన 16 రోజుల పసి బాబును కాళ్లతో తొక్కి చంపారు. ఈ తర్వాత ఒక మహిళ శిశువు మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని ఏవో మంత్రాలు పఠించింది. ఆమె చుట్టూ కూర్చున్న మిగతా మహిళలు కూడా ఆ మంత్రాలు చదివారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. శిశువు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలా కాలంగా పెళ్లి కాకపోవడంతో తన మరదళ్లు ఈ దారుణానికి పాల్పడినట్లు పసి బాబు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
16 દિવસના માસૂમ બાળકની બેરહમીથી હત્યા, 4 માસીઓએ ભેગા મળીને હાથ-પગ તોડ્યા અને પગથી કચડીને મારી નાખ્યું#crimefiles #crimenews #crime #viralvideo #viral #viralshort #viralshorts #viralvideos #viralreels #trending #trendingshorts #trendingvideo pic.twitter.com/Yqtf4zmpYn
— Zee 24 Kalak (@Zee24Kalak) November 15, 2025
Also Read:
Bride To Be Killed By Fiance | పెళ్లికి గంట ముందు గొడవ.. కాబోయే భార్యను హత్య చేసిన కాబోయే భర్త
Man prints fake notes | ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తున్న వ్యక్తి.. ఇంట్లో నకిలీ నోట్లు ముద్రణ