పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రూ.14,000 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం వినియోగించిందని ప్రశాంత్ కిషోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj) ఆరోపించింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద 1.25 కోట్ల మహిళలకు రూ.10,000 చొప్పున నగదు బదిలీ చేయడానికి ఈ నిధులు దారి మళ్లించినట్లు విమర్శించింది. తద్వారా ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికలను ప్రభావితం చేసినట్లు ఆరోపించింది.
కాగా, జన్ సూరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంకు కేటాయించిన నిధుల్లో రూ.14,000 కోట్లను బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రభుత్వం వాడేసిందని ఆరోపించారు. ‘ఈ ఎన్నికల ఫలితం సమర్థవంతంగా కొనుగోలు ద్వారా లభించింది. జూన్ 21 నుంచి పోలింగ్ రోజు వరకు గెలుపు కోసం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేశారు. ప్రజాధనంతో ప్రజల ఓట్లను కొనుగోలు చేశారు. ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన నిధులను మహిళలకు నగదు బదిలీల కోసం ఉపయోగించినట్లు నాకు తెలిసింది’ అని ఆయన అన్నారు.
అయితే ఇంత పెద్ద మొత్తంలో డబ్బును తిరిగి పొందే సామర్థ్యం బీహార్ ఆర్థిక వ్యవస్థకు లేదని ఉదయ్ సింగ్ ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడానికి ఇప్పుడు చాలా తక్కువ నిధులు మిగిలి ఉన్నాయని విమర్శించారు.
మరోవైపు జన్ సురాజ్ పార్టీ ప్రతినిధి పవన్ వర్మ కూడా ఈ ఆరోపణను పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఖజానా ఇప్పుడు ఖాళీ అయ్యిందని తెలిపారు. ‘మా దగ్గర సమాచారం ఉంది. అది తప్పు కావచ్చు. అంతేకాకుండా రాష్ట్రంలోని మహిళలకు ఇచ్చిన రూ.10,000 మొత్తాన్ని వేరే ప్రాజెక్టు కోసం ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన రూ. 21,000 కోట్ల నుంచి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి గంట ముందు రూ.14,000 కోట్లు అందులో నుంచి తీశారు. రాష్ట్రంలోని 1.25 కోట్ల మహిళలకు పంపిణీ చేశారు’ అని ఆరోపించారు.
కాగా, ప్రజా ధనాన్ని స్పష్టంగా దుర్వినియోగం చేయడం, ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసే అనైతిక ప్రయత్నం ఈ చర్య అని జన్ సురాజ్ పార్టీ ఆరోపించింది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
#WATCH | #BiharElection2025 | Patna: Jan Suraaj president Uday Singh says, “Congratulations to the NDA for a thumping majority. But this is a mandate that has been bought. After 21st June, the Govt used Rs 40,000 Crores from the Govt treasury to get this mandate. This will affect… pic.twitter.com/fHrXiEea1o
— ANI (@ANI) November 15, 2025
Also Read:
Rohini Acharya | రోహిణి ఆచార్య పేర్కొన్న.. సంజయ్ యాదవ్, రమీజ్ ఎవరు?
Man prints fake notes | ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న వ్యక్తి.. ఇంట్లో నకిలీ నోట్లు ముద్రణ