ముంబై: స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన బాలికను దారుణంగా శిక్షించారు. వీపునకు తగిలించుకున్న బ్యాగ్‌తో వంద గుంజీలు తీయించారు. (Girl Forced To Do 100 Sit-Ups) దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక ఆసుపత్రి పాలై మరణించింది. బాలల దినోత్సవం రోజున ఇది కలకలం రేపింది. మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వాసాయికి చెందిన12 ఏళ్ల కాజల్ గోండ్, స్థానిక శ్రీ హనుమంత్ విద్యా మందిర్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నది. నవంబర్ 14న బాలల దినోత్సవం రోజు పది నిమిషాలు ఆలస్యంగా స్కూల్‌కు చేరుకున్నది.
కాగా, చిన్నారుల దినోత్సవం రోజున పిల్లలపై ప్రేమ, కరుణ చూపించాల్సిన టీచర్, విద్యార్థి కాజల్ పట్ల కఠినంగా వ్యవహరించారు. స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినందుకు బలవంతంగా వంద గుంజీలు తీయించారు. వీపు వెనుక స్కూల్ బ్యాగ్ ఉన్న ఆ విద్యార్థిని వంద గుంజీలు తీసింది. ఆ తర్వాత నడుము కింది భాగంలో తీవ్ర నొప్పితో అల్లాడిపోయింది.
మరోవైపు స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కాజల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. తొలుత నలసోపారాలోని ఆసుపత్రిలో ఆమెను చేర్చారు. ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ బాలిక మరణించింది.
కాగా, బాలల దినోత్సవం రోజున కనికారం చూపకుండా కఠినంగా శిక్షించి కాజల్ మరణానికి కారణమైన ఆ స్కూల్‌పై ఆమె తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ టీచర్‌తో పాటు స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసే వరకు స్కూల్ తెరిచేందుకు అనుమతించబోమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) హెచ్చరించింది.
Also Read:
Rohini Acharya | రోహిణి ఆచార్య పేర్కొన్న.. సంజయ్ యాదవ్, రమీజ్ ఎవరు?
Man, Live-In Partner Kill Colleague | స్నేహం చేయాలనుకున్న సహోద్యోగి.. హత్య చేసిన సహజీవన జంట
Man prints fake notes | ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న వ్యక్తి.. ఇంట్లో నకిలీ నోట్లు ముద్రణ
woman goes missing in Pak | భారతీయ మహిళ పాక్‌లో అదృశ్యం.. మతం మారి ఆ దేశ వ్యక్తితో పెళ్లి