చెన్నై, మార్చి14: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమితో పొత్తు ప్రసక్తే లేదని తమిళ నటుడు విజయ్ నేతృత్వంలోని ‘టీవీకే’ (తమిళగ వెట్రి కజగం) ప్రకటించింది. బీజేపీతో ఎన్నికల పొత్తు ఉందంటూ వస్తున్న వార్తలను కేవలం మీడియా ఊహాగానాలుగా టీవీకే కొట్టివేసింది.
ఈ విషయాన్ని పార్టీ జిల్లా కార్యదర్శులతో నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల పొత్తుపై ఎన్డీయేతో సంప్రదింపులు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తల్ని ఆయన ఖండించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు టీవీకేపై రోజూ మీడియా, సోషల్మీడియాలో వదంతులు వెలువడుతున్నాయని, వీటిని నమ్మవద్దని పార్టీ నేతలకు ఆయన సూచించారు.