నీలగిరి, మార్చి 14: మహిళలను పురుషులతో సమానంగా ఎదిగేలా తయారు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన నల్గొండలోని సెట్విన్ సంస్థలో కుట్టు శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టు మిషన్లను, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఎవరూ ఖాళీగా ఉండవద్దని, పట్టుదలతో ఏదో ఒక కోర్సులో శిక్షణ పొంది స్వయం ఉపాధి కల్పించుకోవాలన్నారు. శిక్షణ పొందిన మహిళలు సంఘాలుగా ఏర్పడితే వారు స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పిస్తామని, అలాగే సూల్ విద్యార్థుల యూనిఫాం కుట్టే పనిని సంఘాలకే అప్పగిస్తామన్నారు.
కలెక్టరేట్ కార్యాలయం వద్ద న్యాక్ శిక్షణ సంస్థ ఏ ర్పాటు చేసి దాని ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. అలాగే కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్ట్రక్టర్లుగా నియమిస్తామని మంత్రి వెల్లడించారు. న ల్గొండ సెట్విన్ ద్వారా మరిన్ని కోర్సుల ను ఏర్పాటు చేయాలని, అందరికీ పని చూ పించాలని సూచించారు. మేయర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ సెట్విన్ ద్వారా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్నమహిళలు స్వయం ఉపాధి కల్పించుకోవాలని, స్వయం సహాయక మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరితే బ్యాంకు నుంచి రుణాలు ఇప్పిస్తామన్నారు.సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కుట్టుమిషన్లు, కళ్యాణ లక్ష్మీ చెకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, సెట్విన్ ప్రిన్సిపాల్ రేణుక పాల్గొన్నారు.