కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. డ్రోన్లతో రష్యా మనుషులను వేటాడి(Drone Safari Attack) చంపుతోందన్నారు. ఆయన తన టెలిగ్రాం అకౌంట్లో తాజాగా జరిగిన ఓ ఘటనకు చెందిన వీడియోను పోస్టు చేశారు. దక్షిణ ఉక్రెయిన్లో ఈ దాడి జరిగింది. రోడ్డుపై కూరగాయలు అమ్ముకునే ఓ మొబైల్ వ్యాన్ వ్యాపారి వద్దకు డ్రోన్ వచ్చి.. అతనిపై దారుణంగా అటాక్ చేసింది. ఆ వ్యాపారి చేతులు జోడించి వేడుకున్నా.. డ్రోన్ అటాక్ ఆగలేదు. వ్యాన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. అతన్ని వదలలేదు. డ్రోన్ పేలడంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. శరీరంలోకి పెల్లెట్స్ దిగాయి. రష్యా సఫారీ దాడులకు పాల్పడుతున్నట్లు జెలెన్స్కీ ఆరోపించారు. ఖేర్సన్ ప్రాంతంలో వీధి వ్యాపారిపై జరిగిన ఆ దాడికి సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఉక్రెయిన్ ఫ్రంట్లైన్ ఏరియాలో ఉన్న ప్రజలను సఫారీ డ్రోన్లతో రష్యా భయపడుతున్నట్లు జెలెన్స్కీ ఆరోపించారు. రిమోట్ ద్వారా ఆపరేట్ చేసే ఆ డ్రోన్లను రష్యా ఎక్కువగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచం ఈ ఘటనను ప్రత్యక్షంగా చూడాలని ఆయన తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రష్యా పిచ్చిగా వ్యవహరిస్తోందని, ప్రజలను చంపడాన్ని రష్యా సైనికులు ఎంజాయ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది అమానవీయ యుద్ధం నేరం అవుతుందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి అంద్రి సిబిహ తెలిపారు.
Human Safari in Kherson
Russian troops practice controlling FPV drones on Ukrainian civilians.
Footage filmed today shows a Russian drone deliberately hunting a vegetable seller who clasps his hands in a pleading gesture.
Fortunately, the man survived but sustained injuries. pic.twitter.com/uPIhZCHdp0
— Visegrád 24 (@visegrad24) August 4, 2026