అహ్మదాబాద్: పెళ్లికి గంట ముందు చీర, డబ్బుల విషయంపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కాబోయే భార్యను కాబోయే భర్త హత్య చేశాడు. (Bride To Be Killed By Fiance) ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్లోని భావ్నగర్లో ఈ సంఘటన జరిగింది. సాజన్ బరయ్య, సోని హిమ్మత్ రాథోడ్ ప్రేమించుకున్నారు. వారి కుటుంబాలకు ఇష్టం లేకపోవడంతో ఏడాదిన్నర కాలంగా ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.
కాగా, సాజన్, సోని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. నవంబర్ 15న రాత్రికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. వెడ్డింగ్ కార్డులు ప్రింట్ చేసి బంధువులు, స్నేహితులను ఆహ్వానించారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెళ్లి తంతులు కూడా జరిగాయి. మరో గంటలో వివాహ బంధంలోకి వారు అడుగుపెట్టనున్నారు.
అయితే పెళ్లి చీర, డబ్బుల విషయంలో వధూవరుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన సాజన్ ఐరన్ రాడ్తో సోనిని కొట్టాడు. ఆమె తలను గోడకేసి బాదాడు. ఇంటిని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు సోని హత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు సాజన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అదే రోజున పొరుగు వ్యక్తితో కూడా అతడు గొడవ పడినట్లు ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Man, Live-In Partner Kill Colleague | స్నేహం చేయాలనుకున్న సహోద్యోగి.. హత్య చేసిన సహజీవన జంట
woman goes missing in Pak | భారతీయ మహిళ పాక్లో అదృశ్యం.. మతం మారి ఆ దేశ వ్యక్తితో పెళ్లి