టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ మీటర్ల కొరత ఏర్పడింది. దీంతో మూడునెలలుగా గృహ కనెక్షన్ల జారీ నిలిచిపోయింది. దీంతోపాటు కాలిపోయిన , స్టకప్ అయిన మీటర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చాల్సి ఉన్నా మీటర్లు లేని కారణంగా వినియోగదారులు పాతబిల్లులనే చెల్లిస్తూ నష్టపోతున్నారు. దక్షిణ డిస్కం స్థాయిలో ఎక్కడిక్కడ జిల్లాల్లో మీటర్లు సిద్ధంగా ఉంచాల్సింది. మీటర్ల కోసం ఆన్లైన్లో డీడీలు కట్టి దరఖాస్తు చేసుకోగానే మీటర్ బిగించి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలి. కానీ డిస్కం స్టోర్స్‌లో మీటర్లు స్టాక్ లేకపోవడంతో సిబ్బంది ఏదో ఒక సాకు చెప్పి మీటర్లు బిగించకపోవడం కారణంగా డిస్కం పరిధిలో కొత్తగా ఇండ్లు నిర్మించుకున్నవారు ఇబ్బందులు పడుతున్నారు.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ)
గ్రేటర్ పరిధిలోని పదిసర్కిళ్లలో సుమారు 50 వేల మీటర్లు పనిచేయడం లేదని విద్యుత్ సిబ్బంది చెప్పారు. గ్రేటర్లో 42,600 మీటర్లు రీడింగ్ నిలిచిపోయినవి ఉన్నట్లుగా ఫిర్యాదులు రాగా ఆ సంఖ్య 50 వేలకు చేరుతుందని, అయితే ఈ నెలలో మరో ఆరు నుంచి ఏడు వేల మీటర్లు చెడిపోవడంతో అసలు కొత్త మీటర్లు ఎలా బిగించాలో తెలియక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం కావడంతో కరెంట్ రీడింగ్ సాధారణంగా వచ్చేదానికంటే అదనంగా వస్తుంది కాబట్టి కొత్త మీటర్లు అమర్చే దిశగా డిస్కం ప్రయత్నిస్తున్నదని అధికారులు చెబుతున్నా కార్యాచరణలో మాత్రం అమలు కావడం లేదు.
శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పనిచేయని మీటర్ల సంఖ్య ఉండగా కొత్తవి లేకపోవడంతో వాటిని మార్చే వీలు లేకపోయింది. గ్రేటర్ పరిధిలో మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్లలోని పదిసర్కిల్లలో అత్యధికంగా సంగారెడ్డి సర్కిల్లో 8వేలు, రాజేంద్రనగర్‌లో 5500, మేడ్చల్ 7200, హబ్సిగూడలో 6వేలు, సరూర్‌నగర్‌లో 6600, బంజారాహిల్స్ సర్కిల్లో 950 స్టకప్ మీటర్లు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. స్టకప్ మీటర్ల సంగతి ఇలా ఉంటే ఇక కొత్తగా ఇల్లు కట్టుకుని మీటర్లకు ఐప్లె చేసిన వారు మరో పదివేల మందికి పైగా ఉంటారని, వీరికి కూడా ఇంతవరకు మీటర్లు జారీ చేయలేదని ఒక విద్యుత్ అధికారి చెప్పారు.
యావరేజ్ బిల్లుతో నష్టం..
టీజీఎస్పీడీసీఎల్ నిర్వాకంతో విద్యుత్ వినియోగదారులు నష్టాలకు గురికావాల్సి వస్తున్నది. ఆరేడు నెలలుగా కాలిపోయిన, స్ట్రక్ అయిన మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను బిగించకుండా యావరేజ్ బిల్లింగ్ పేరుతో వినియోగదారులను నిలువుదోపిడీ చేస్తున్నారు.స్ట్రకప్ మీటర్లు ఉన్న విద్యుత్ వినియోగదారులకు యావరేజ్ అంటే స్టేటస్ 2 కేటగిరిలో విద్యుత్ బిల్లులు జారీ చేస్తున్నారు. దీంతో చాలామంది వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. గ్రేటర్ పరిధిలోని పది సర్కిళ్ల పరిధిలో వేలాదిమంది వినియోగదారులకు సకాలంలో మీటర్లు అందించడం లేదు.
వినియోగదారుని మీటర్ స్ట్రక్ అయినా, కాలిపోయినా నెలరోజుల లోపు కొత్త మీటర్ బిగించాల్సిన బాధ్యత ఎస్డీపీసీఎల్దే కాగా మీటర్లు లేకపోవడంతో బిగించడం లేదు. దీంతో వినియోగదారులకు యావరేజ్ బిల్లు పేరుతో చేస్తున్న బిల్లింగ్‌లో వస్తున్న అదిక చార్జిల కారణంగా ప్రతీనెలా రూ.500నుంచి రూ.100ల వరకు ఎక్కువగా బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది ఎక్కువ బిల్లు వచ్చిన దానిని యావరేజ్‌గా తీసుకుని అదే బిల్లు వసూలు చేయడంతో వీరికి సరాసరిగా నాలుగునెలల వరకు తీసుకున్న ఒకొక్కరికి నెలకు వెయ్యి చొప్పున నాలుగువేల వరకు అధికంగా బిల్లులు చెల్లింంచాల్సి వస్తున్నదని వారు వాపోతున్నారు.
సైబరాబాద్‌లో జరుగుతున్న 4వ తెలంగాణ పోలీస్ డ్యూటీమీట్‌లో భాగంగా ఆదివారం జరిగిన యోగ పోటీల్లో సీఎం సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న అడిషనల్ ఎస్పీ సీహెచ్ వాసుదేవరెడ్డి రెండు మెడల్స్ సాధించారు. ఆర్టిస్టిక్ యోగలో గోల్డ్, ట్రడిషనల్లో సిల్వర్ సాధించారు. ఆయన మెడల్స్ సాధించడం పట్ల సైబరాబాద్ సీపీ రమేశ్‌రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు వాసుదేవరెడ్డిని అభినందించారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ)