Meta Apology: ఫేస్బుక్లో ప్రధాని మోదీ వీడియో బ్లాక్.. క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ
Meta Apology: కేంద్ర ప్రభుత్వానికి మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది. ప్రధాని మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన అంశంలో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. టెక్నికల్ కారణాల వల్ల ఆ వీడియోను తొలగించినట్లు మెటా సంస్థ అధికారులతో పేర్కొన్నది.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి మెటా సంస్థ క్షమాపణలు(Meta Apology) చెప్పింది. ప్రధాని మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి డిలీట్ చేసిన అంశంలో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. టెక్నికల్ కారణాల వల్ల ఆ వీడియోను తొలగించినట్లు మెటా సంస్థ అధికారులతో పేర్కొన్నది. అయితే తొందరపాటు ఆ వీడియోను తొలగించామని, కానీ మళ్లీ ఆ వీడియోను రిస్టోర్ చేసినట్లు మెటా సంస్థ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఫేస్బుక్ నుంచి మోదీ వీడియోను తొలగించడం పట్ల ప్రభుత్వం సిరీయస్గా ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వార తెలుస్తోంది. మెటా ఇచ్చిన వివరణపై అధికారులు ఆరా తీస్తున్నారు. వరుసక్రమ ఘటనలపై ఫోకస్ పెట్టారు.
మెటా సంస్థ ప్రతినిధులు, సంబంధిత అధికారులకు .. ప్రభుత్వం సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. జూలై 23వ తేదీన ప్రధాని మోదీ ఓ వీడియోను అప్లోడ్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలను ఉద్దేశిస్తూ ఆయన ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటనలను నిలువరించేందుకు కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రధాని తన వీడియోలో పేర్కొన్నారు. అయితే వీడియోను కాసేపు ఎక్స్లో కనిపించలేదు. ఓ లీగల్ రిక్వెస్ట్ వల్ల వీడియోను విత్హెల్డ్లో పెట్టినట్లు నోటీసులో పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆ వీడియో రిస్టోర్ అయ్యింది. వీడియోను తొలగించడానికి ముందే దానికి లక్షల సంఖ్యలో వ్యూవ్స్ వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- blocked
- cjp protests
- Meta
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

