Ambedkar University | అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభం
Ambedkar University | హనుమకొండ చౌరస్తా, జూలై 28: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు వరంగల్ ప్రాంతీయ సంచాలకులు ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు.
Ambedkar University | హనుమకొండ చౌరస్తా, జూలై 28: డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సుల ప్రవేశాలు ప్రారంభమైనట్లు వరంగల్ ప్రాంతీయ సంచాలకులు ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్మీడియట్, 10+2 అర్హత కలిగిన విద్యార్థులతో పాటు రెండేళ్ల పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు.
డిగ్రీ ప్రవేశాల కోసం ఆధార్ కార్డు, SSC, ఇంటర్మీడియట్ మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైన వారికి), పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో సమీప ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రవేశాలకు ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అభ్యర్థులు www.braouonline.in వెబ్సైట్లో ప్రవేశ నమోదు పూర్తి చేసి, తాము ఎంపిక చేసుకున్న అధ్యయన కేంద్రంలో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాలని వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-0101, ఫోన్ నంబర్లు 040-23680333, 040-23680444, 040-23680555లను సంప్రదించాలని జ్యోతి కోరారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

