Hyderabvad |హైదరాబాద్‌లో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశచూపి నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఓ అపార్ట్మెంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని నిందితుడు చాక్లెట్లు ఇస్తానని నమ్మించి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లికి చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు మల్కాజ్గిరి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో నిందితుడిని మల్లికార్జున్ నగర్‌కు చెందిన టెంట్ హౌస్‌లో పనిచేసే రవి కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.