బెంగళూరు: నకిలీ నందిని నెయ్యి (Fake Nandini Ghee) రాకెట్ గుట్టురట్టయ్యింది. రూ.56.95 లక్షల విలువైన 8,136 లీటర్ల కల్తీ నెయ్యి, నకిలీ నెయ్యి తయారీ యంత్రాలు, ఇతర నూనెలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. జంతువుల కొవ్వు వాడకంపై దర్యాప్తు చేస్తున్నారు. దక్షిణ భారత్‌లో అత్యంత విశ్వసనీయ పాల బ్రాండ్లలో ఒకటైన ‘నందిని’కి మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్నది. ఈ నేపథ్యంలో నిందితులు తమిళనాడులో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు. కర్ణాటకకు రవాణా చేసి అక్కడ విక్రయిస్తున్నారు.
కాగా, కర్ణాటక కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) యాజమాన్యంలోని ‘నందిని’ నెయ్యి పంపిణీదారుడికి చెందిన ఏజెన్సీ ఈ బ్రాండ్ పేరుతో నకిలీ నెయ్యి తయారు చేసి అమ్ముతున్నట్లు సమాచారం అందింది. దీంతో నవంబర్ 14న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ స్క్వాడ్, కేఎంఎఫ్ విజిలెన్స్ వింగ్‌కు చెందిన సంయుక్త బృందం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. చామరాజ్‌పేటలోని నంజంబ అగ్రహారలో కృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన గోడౌన్లు, షాపులు, వాహనాలను అధికారులు తనిఖీ చేశారు. తమిళనాడుతో తయారై అక్కడి నుంచి రవాణా చేసిన ‘నకిలీ’ నందిని సాచెట్లు, ప్లాస్టిక్ బాటిళ్లలో ప్యాక్ చేసిన కల్తీ నెయ్యితో కూడిన వాహనాన్ని అడ్డుకుని సోదా చేశారు.
మరోవైపు ఈ స్పెషల్ రైడ్‌లో రూ.1.26 కోట్ల విలువైన ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.56.95 లక్షల విలువైన 8,136 లీటర్ల కల్తీ నెయ్యి, నకిలీ నెయ్యి తయారుకు వినియోగించే యంత్రాలు, నాసిరకం కొబ్బరి, పామాయిల్ నూనెలు, ఐదు మొబైల్ ఫోన్లు, రూ.1.19 లక్షల నగదు, రూ.60 లక్షల విలువైన నాలుగు బొలెరో గూడ్స్ వాహనాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.

Mahendra, Deepak, Muniraj, Abhiarasu
కాగా, కేఎంఎఫ్ పంపిణీదారుడు మహేంద్ర, అతడి కుమారుడు దీపక్, మునిరాజు, అభిరాసును నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిని అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కల్తీ నెయ్యిలో జంతువుల కొవ్వు వాడకంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నకిలీ నెయ్యి శాంపిల్స్‌ను పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపినట్లు చెప్పారు. ఆ రిపోర్ట్ ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Bengaluru Police Busts ₹1.26 Crore Nandini Ghee Adulteration Racket in Bengaluru; Four Held.
Bengaluru
The Central Crime Branch (#CCB) Special Investigation Squad of Bengaluru Police, in coordination with the Karnataka Milk Federation (#KMF) Vigilance Wing, has busted a major… pic.twitter.com/B5zdr6VZyB
— Yasir Mushtaq (@path2shah) November 16, 2025
Also Read:
Man prints fake notes | ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న వ్యక్తి.. ఇంట్లో నకిలీ నోట్లు ముద్రణ
Lalu Yadav’s 3 daughters Left | రోహిణి ఆచార్య తర్వాత.. లాలూ నివాసాన్ని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు