పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. రెండో కుమార్తె రోహిణి ఆచార్య తర్వాత ఆయన మరో ముగ్గురు కుమార్తెలు కూడా ఆ ఇంటి నుంచి వెళ్లిపోయారు. (Lalu Yadav’s 3 daughters Left) లాలూ మరో ముగ్గురు కుమార్తెలైన రాజలక్ష్మి, రాగిణి, చందా కూడా పాట్నాలోని కుటుంబ నివాసాన్ని వీడారు. తమ పిల్లలతో కలిసి ఆదివారం ఢిల్లీ వెళ్లారు. దీంతో లాలూ కుటుంబం మరింతగా చీలిపోయింది.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి తప్పును తనపై వేసుకుంటున్నట్లు రోహిణి ఆచార్య శనివారం తెలిపారు. పార్టీతో పాటు కుటుంబాన్ని వదిలేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. సోదరుడు తేజస్వి యాదవ్ సన్నిహితులైన ఎంపీ సంజయ్ యాదవ్, ఆయన దీర్ఘకాల సహచరుడు రమీజ్ కోరుకున్నదే తాను చేసినట్లు చెప్పారు.
మరోవైపు ఎన్నికల్లో ఓటమికి తాను కారణమని తేజస్వి యాదవ్ తనను తిట్టినట్లు రోహిణి ఆచార్య ఆదివారం ఆరోపించారు. ‘నాన్నకు మురికి కిడ్నీ ఇచ్చావు’ అని సోదరుడు తనను తీవ్రంగా అవమానించడంతోపాటు దుర్భాషలాడినట్లు మరో పోస్ట్‌లో వాపోయారు. తేజస్వి తనపై చెప్పు కూడా ఎత్తినట్లు ఆమె ఆరోపించారు. శనివారం తాను ఏడుస్తూ లాలూ ఇంటిని వీడినట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం రోహిణి ఆచార్య సింగపూర్ వెళ్లినట్లు తెలుస్తున్నది.
Also Read:
Tej Pratap | నా సోదరికి జరిగిన అవమానం భరించలేనిది: తేజ్ ప్రతాప్
Women Trample Infant to Death | పెళ్లి కావడం లేదని.. పసిబిడ్డను కాళ్లతో తొక్కి చంపిన మహిళలు