పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఘోర పరాజయం తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రస్థాయికి చేరాయి. ఎన్నికల్లో ఓటమికి తాను కారణమని తేజస్వి యాదవ్ తిట్టినట్లు సోదరి రోహిణి ఆచార్య (Rohini Acharya) ఆరోపించింది. ‘నాన్నకు మురికి కిడ్నీ ఇచ్చావు’ అని తనను తీవ్రంగా అవమానించడంతోపాటు మాటలతో దుర్భాషలాడినట్లు వాపోయింది. తేజస్వి తనపై చెప్పు కూడా ఎత్తినట్లు ఆమె ఆరోపించింది.
కాగా, ఆర్జేడీతో పాటు కుటుంబాన్ని వదులుకున్నట్లు శనివారం పేర్కొన్న 46 ఏళ్ల రోహిణి ఆచార్య ఆదివారం మరో పోస్ట్‌లో సంచలన విషయాలు బయటపెట్టింది. ‘నిన్న నన్ను దుర్భాషలాడారు. నేను ‘మురికి’ అని, నా తండ్రికి ‘మురికి కిడ్నీ’ ఇచ్చానని అన్నారు. నా దానానికి ప్రతిఫలంగా కోట్ల రూపాయలు, టికెట్ తీసుకున్నానని నాపై ఆరోపణలు చేశారు’ అని ఆ పోస్ట్‌లో పేర్కొంది.
మరోవైపు తన భర్త, పిల్లలపై దృష్టి పెట్టడం కంటే తండ్రిని కాపాడుకోవడానికి కిడ్నీ దానం చేయడం తాను చేసిన పాపమని రోహిణి ఆచార్య వాపోయింది. ‘నా కుటుంబాన్ని, నా ముగ్గురు పిల్లలను జాగ్రత్తగా చూసుకోకపోవడం, కిడ్నీ దానం చేసేటప్పుడు నా భర్త లేదా నా అత్తమామల అనుమతి తీసుకోకపోవడం నాకు చాలా పెద్ద పాపంగా మారింది. నా దేవుడు, నా తండ్రిని కాపాడటానికి నేను చేసిన పాపం ఇదే. ఈ రోజు దానిని మురికిగా పిలుస్తున్నారు. కుమార్తెలు, సోదరీమణులకు నేను చెప్పాలనుకుంటున్నా. మీ తల్లిదండ్రుల ఇంట్లో ఒక కొడుకు లేదా సోదరుడు ఉంటే, మీ తండ్రిని రక్షించే తప్పు ఎప్పుడూ చేయకండి. కొడుకు లేదా అతడి స్నేహితులలో ఒకరు కిడ్నీ దానం చేయనివ్వండి’ అని ఆ పోస్ట్‌లో సూచించింది.
కాగా, శనివారం లాలూ ఇంటిని తాను వీడినట్లు రోహిణి ఆచార్య తెలిపింది. ‘నిన్న ఒక కూతురు ఏడుస్తున్న తల్లిదండ్రులను, సోదరీమణులను బలవంతంగా వదిలి వెళ్లిపోయింది. వారు నా పుట్టింటి నుంచి నన్ను దూరం చేశారు. నన్ను అనాథగా వదిలేశారు. మీలో ఎవరూ నా బాటలో నడవకూడదు, ఏ కుటుంబానికి కూడా రోహిణి లాంటి కూతురు, సోదరి ఉండకూడదు’ అని ఆ పోస్ట్‌లో వాపోయింది.
कल मुझे गालियों के साथ बोला गया कि मैं गंदी हूँ और मैंने अपने पिता को अपनी गंदी किडनी लगवा दी , करोड़ों रूपए लिए , टिकट लिया तब लगवाई गंदी किडनी .. सभी बेटी – बहन , जो शादीशुदा हैं उनको मैं बोलूंगी कि जब आपके मायके में कोई बेटा – भाई हो , तो भूल कर भी अपने भगवान रूपी पिता को…
— Rohini Acharya (@RohiniAcharya2) November 16, 2025
Also Read:
Bride To Be Killed By Fiance | పెళ్లికి గంట ముందు గొడవ.. కాబోయే భార్యను హత్య చేసిన కాబోయే భర్త
Women Trample Infant to Death | పెళ్లి కావడం లేదని.. పసిబిడ్డను కాళ్లతో తొక్కి చంపిన మహిళలు