పాట్నా: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంతోపాటు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తేజ్ పత్రాప్ యాదవ్ (Tej Pratap) తన కుటుంబ కలహాలపై స్పందించారు. సోదరి రోహిణి ఆచార్యకు జరిగిన అవమానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భరించలేనని అన్నారు. తన కుటుంబంపై దాడి చేసే వారిని బీహార్ ప్రజలు క్షమించరని తేజ్ పత్రాప్ యాదవ్ హెచ్చరించారు. తమ్ముడు తేజస్వి యాదవ్ చర్యపై ఆయన మండిపడ్డారు. ‘నా సోదరి రోహిణిపై చెప్పు ఎత్తిన వార్త విన్నప్పటి నుంచి నా గుండెలో బాధ నిప్పులా మారిపోయింది. ప్రజల మనోభావాలు గాయపడినప్పుడు తెలివితేటలపై ఉన్న దుమ్ము ఎగిరిపోతుంది. ఈ కొద్దిమంది ముఖాలు తేజస్వి తెలివితేటలను కూడా కప్పేశాయి’ అని ఆన్లైన్ పోస్ట్‌లో విమర్శించారు.
కాగా, తన కుటుంబంపై దాడి చేసే వారిని బీహార్ ప్రజలు క్షమించరని తేజ్ పత్రాప్ యాదవ్ హెచ్చరించారు. కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి తండ్రి లాలూ అనుమతిని ఆయన కోరారు. ‘ఈ అన్యాయం పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. కాలాన్ని లెక్కించడం చాలా కఠినంగా ఉంటుంది. గౌరవనీయులైన ఆర్జేడీ జాతీయ అధ్యక్షుడు, నా తండ్రి, నా రాజకీయ గురువైన లాలూ ప్రసాద్ జీకి విన్నపం. తండ్రీ నాకు ఒక సిగ్నల్ ఇవ్వండి. తల ఊపితే చాలు. ఈ జైచంద్లకు బీహార్ ప్రజలు సమాధి కట్టేస్తారు. ఈ పోరాటం ఏ పార్టీ గురించో కాదు. ఇది ఒక కుటుంబ గౌరవం. ఒక కుమార్తె గౌరవం, బీహార్ ఆత్మగౌరవం గురించి’ అని ఆ పోస్ట్‌లో హెచ్చరించారు.
Also Read:
Women Trample Infant to Death | పెళ్లి కావడం లేదని.. పసిబిడ్డను కాళ్లతో తొక్కి చంపిన మహిళలు
Bride To Be Killed By Fiance | పెళ్లికి గంట ముందు గొడవ.. కాబోయే భార్యను హత్య చేసిన కాబోయే భర్త