T20 World Cup | పాక్ నిష్క్రమణ.. సెమీఫైనల్ వేదికలు ఖరారు..!
T20 World Cup : పొట్టి ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించడంతో భారత్‌లోనే బిగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈడెన్ గార్డెన్స్, వాంఖడేలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
T20 World Cup : పొట్టి ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించడంతో భారత్‌లోనే బిగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. సూపర్ 8 చివరి మ్యాచ్‌లో శ్రీలంకను 147లోపు కట్టడి చేయలేక పాక్ ఇంటిదారి పట్టడంతో సెమీస్ వేదికలపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. న్యూజిలాండ్ ఫైనల్ చేరడంతో.. ఈడెన్ గార్డెన్స్, వాంఖడేలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
గ్రూప్ బీ నుంచి న్యూజిలాండ్ సెమీస్ బెర్తు పట్టేయగా.. భారత్‌లోనే షెడ్యూల్ ప్రకారం అనుకున్న సెమీ ఫైనల్, ఫైనల్ వేదికల్ని ఐసీసీ, బీసీసీఐ ఖరారు చేశాయి. ఒకవేళ పాక్ అర్హత సాధించి ఉంటే కొలంబోలోనే సెమీస్, ఒకవేళ ఫైనల్‌కు చేరితే.. ఈ మ్యాచ్ కూడా అక్కడే ఆడించాల్సి వచ్చేది.
Locked in, finally 🔒 pic.twitter.com/GneMuNGhxp
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2026
కానీ, సల్మాన్ అఘా బృందం గెలిచినా కివీస్ రన్ రేటు(+1.390)ను అధిగమించలేకపోవడం భారత్‌కు ప్లస్ అయింది. మార్చి 4న జరిగే తొలి సెమీస్‌ను కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో, మార్చి 5న రెండో సెమీస్ మ్యాచ్‌ను ముంబైలోని వాంఖడేలో నిర్వహించనున్నారు. టైటిల్ పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మార్చి 8వ తేదీన జరుగనుంది.
రత్ననాయకే, షనక మెరుపులు
పొట్టి ప్రపంచకప్ నుంచి వెళ్తూ వెళ్తూ పాకిస్థాన్‌ను తీసుకెళ్లింది శ్రీలంక. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన సూపర్ 8 చివరి మ్యాచ్‌లో పాక్ సెమీస్ ఆశల్ని ఆవిరి చేసింది ఆతిథ్య జట్టు. ఓపెనర్ ఫర్హాన్(100) సెంచరీ, ఫఖర్ జమాన్(84) విధ్వంసంతో భారీ స్కోర్ చేసిన పాక్.. లంకను 147లోపే కట్టడి చేయలేకపోయింది. దసున్ శనక(76 నాటౌట్), పవన్ రత్ననాయకే(58)లు చితక్కొడుతూ పాక్ బౌలర్లను నీరుగార్చారు.
West Indies or India? 👀 pic.twitter.com/ydBpxqdYwl
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2026
ఫలింతగా గ్రూప్ బీ నుంచి న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఓదార్పు విజయంతో సల్మాన్ అఘా బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీలంకను 147లోపు కట్టడి చేయలేకపోయారు. స్పిన్నర్లు చెలరేగినా.. పవన్ రత్ననాయకే(58) అర్ధశతకంతో విరుచుకుపడి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

