ఢిల్లీ : హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ ఐఎస్ఎస్ఎఫ్ ర్యాంకుల్లో అదరగొట్టింది. మహిళల 25 మీటర్ల ఫిస్టల్ కేటగిరీలో ఇషా.. 6,384 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఇషా.. ఈ ఏడాది ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్కప్ సర్క్యూట్లో భాగంగా మునిచ్, హాంగ్జౌలో స్వర్ణాలు గెలిచి సత్తాచాటింది.
పతకాలతో పాటు తాజాగా ఆమె తన ర్యాంకునూ మెరుగుపరుచుకుని అగ్రస్థానానికి చేరుకోవడం గమనార్హం. కాగా ఐఎస్ఎస్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్కు చేరడం ఇషాకు ఇదే తొలిసారి. అంతేగాక మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనూ ఇషా.. 4,961 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.