SL vs PAK : పొట్టి ప్రపంచకప్ నుంచి వెళ్తూ వెళ్తూ పాకిస్థాన్‌ను తీసుకెళ్లింది శ్రీలంక. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన సూపర్ 8 చివరి మ్యాచ్‌లో పాక్ సెమీస్ ఆశల్ని ఆవిరి చేసింది ఆతిథ్య జట్టు. ఓపెనర్ ఫర్హాన్(100) సెంచరీ, ఫఖర్ జమాన్(84) విధ్వంసంతో భారీ స్కోర్ చేసిన పాక్.. లంకను 147లోపే కట్టడి చేయలేకపోయింది. దసున్ శనక(76 నాటౌట్), పవన్ రత్ననాయకే(58)లు చితక్కొడుతూ పాక్ బౌలర్లను నీరుగార్చారు. ఫలింతగా గ్రూప్ బీ నుంచి న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లింది. ఓదార్పు విజయంతో సల్మాన్ అఘా బృందం టోర్నీ నుంచి నిష్క్రమించింది.
నాకౌట్ తొలి మ్యాచ్ వర్షార్పణం కావడం.. ఆపై ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్ జట్టుసెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేశాయి. ఇక ఇంటిదారి పట్టడం పక్కా అనుకున్న వేళ.. న్యూజిలాండ్ అనూహ్యంగా పరాజయం పాలవ్వడం పాక్‌కు కలిసొచ్చింది. శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తే సెమీస్ చేరడం ఖాయమనిపించింది.
Pakistan are OUT of the T20 World Cup ❌ pic.twitter.com/bGh9BUNO55
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2026
కానీ, 212 రన్స్ కొట్టినా పాకిస్థాన్ బంతితో మాత్రం శ్రీలంకను పడగొట్టలేకపోయింది. మైనస్ రన్ రేటులో ఉండడంతో లంకను 147లోపే కట్టడి చేస్తేనే పాక్ సెమీస్ దూసుకెళ్లే పరిస్థితి. ఆరంభంలోనే నసీం షా డేంజరస్ పథుమ్ నిశాంక వికెట్ తీసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత అబ్రార్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగాడు. అంతే.. పాక్ ఆటగాళ్లు ముఖాల్లో ఆనందం విరిసింది. కానీ, పవన్ రత్ననాయకే(58), కెప్టెన్ దసున్ శనక(76)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పి.. పాక్ ఆశలను గల్లంతు చేశాడు.
🌟 THE KNOCK THAT WILL ECHO THROUGH T20 WORLD CUP HISTORY! DASUN SHANAKA! 🌟
Though Sri Lanka lost, Shanaka’s BRUTAL assault will be REMEMBERED forever!
Take a BOW, LEGEND! 🥶🏏🇱🇰🔥#SLvsPAK pic.twitter.com/QRe7sGgTz4
— Cricket With RS (@badkebhai) February 28, 2026
లంక స్కోర్ 148 దాటడమే ఆలస్యం.. పాక్ ఇంటిదారి పట్టింది. గత మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై చివరిఓవర్ దాకా పోరాడి ఓడిన న్యూజిలాండ్ గ్రూప్ బీ నుంచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. అఫ్రిది వేసిని చివరి ఓవర్లో 28 రన్స్ అవసరమవ్వగా.. 4, 6, 6, 6 బాదిన శనక లంకను గెలుపు వాకిట నిలిపాడు. కానీ, రెండు బంతులకు పరుగులేమీ రాకపోవడతో పాక్ 5 వికెట్లతో గెలుపొందింది.