T20 World Cup | ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ ఔట్.. సెమీస్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్..!
T20 World Cup : పొట్టి ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. సెమీఫైనల్ బెర్తుపై కన్నేసిన పాక్ భారీ తేడాతో శ్రీలంకను ఓడించలేకపోయింది.
T20 World Cup : పొట్టి ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. సెమీఫైనల్ బెర్తుపై కన్నేసిన పాక్ భారీ తేడాతో శ్రీలంకను ఓడించలేకపోయింది. ఓపెనర్ ఫర్హాన్(100) సెంచరీతో పల్లెకెలె స్టేడియంలోభారీ స్కోర్ చేసినా.. బౌలర్లు శ్రీలంకను 147లోపు కట్టడి చేయలేకపోయారు. స్పిన్నర్లు చెలరేగినా.. పవన్ రత్ననాయకే(58) అర్ధశతకంతో విరుచుకుపడి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు.
నాకౌట్ తొలి మ్యాచ్ వర్షార్పణం కావడం.. ఆపై ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్ జట్టుసెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేశాయి. ఇక ఇంటిదారి పట్టడం పక్కా అనుకున్న వేళ.. న్యూజిలాండ్ అనూహ్యంగా పరాజయం పాలవ్వడం పాక్‌కు కలిసొచ్చింది. శ్రీలంకపై భారీ తేడాతో గెలిస్తే సెమీస్ చేరడం ఖాయమనిపించింది.
Knocked out in the group stage in 2024, New Zealand make it right immediately after ✅ pic.twitter.com/53uh25NAOV
— ESPNcricinfo (@ESPNcricinfo) February 28, 2026
కానీ, 212 రన్స్ కొట్టినా పాకిస్థాన్ బంతితో మాత్రం శ్రీలంకను పడగొట్టలేకపోయింది. మైనస్ రన్ రేటులో ఉండడంతో లంకను 147లోపే కట్టడి చేస్తేనే పాక్ సెమీస్ దూసుకెళ్లే పరిస్థితి. ఆరంభంలోనే నసీం షా డేంజరస్ పథుమ్ నిశాంక వికెట్ తీసి బ్రేకిచ్చాడు. ఆ తర్వాత అబ్రార్ అహ్మద్ మూడు వికెట్లతో చెలరేగాడు. అంతే.. పాక్ ఆటగాళ్లు ముఖాల్లో ఆనందం విరిసింది. కానీ, పవన్ రత్ననాయకే(58), కెప్టెన్ దసున్ శనకతో కీలక భాగస్వామ్యం నెలకొల్పి.. పాక్ ఆశలను గల్లంతు చేశాడు. లంక స్కోర్ 148 దాటడమే ఆలస్యం.. పాక్ ఇంటిదారి పట్టింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

