అప్పుల బాధతో రైతు ఆత్మహత్య.. సిద్దిపేట జిల్లా బెక్కల్‌లో విషాదం
అప్పుల బాధ తో ఓ రైతు ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై మహ్మద్ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెక్కల్‌కు చెందిన రైతు నలుగొప్పుల నర్సింహులు(58) కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది.
మద్దూరు (ధూళిమిట్ట), మార్చి 1 : అప్పుల బాధ తో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. ఎస్సై మహ్మద్ ఆసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెక్కల్‌కు చెందిన రైతు నలుగొప్పుల నర్సింహులు(58) కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వ్యవసాయంలో అప్పులు కావడంతో నాలుగేండ్ల క్రితం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించి చికిత్స చేయించారు.
వ్యవసాయంతోపాటు వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురైన నర్సింహులు ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లి బెక్కల్-తోర్నాల గ్రామాల శివారులో వ్యవసాయ బావి వద్ద ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
నిరుద్యోగ నిర్మూలనలో పాలకుల విఫలం
- ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర
హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): దేశంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడంలో కేంద్ర, రాష్ట్ర పాలకులు విఫలమయ్యారని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర విమర్శించారు. ఆదివారం ఏఐవైఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాన్ని రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకూ నిరుద్యోగుల సమస్య తీవ్రతరమవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఒకవైపు ప్రభుత్వ రంగం నుంచి ఉద్యోగ ప్రకటనలు లేకపోవడం, మరోవైపు ప్రైవేట్‌రంగంలో ఉద్యోగాలు కోల్పోవడంతో సమస్య మరింత జటిలంగా మారిందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

