న్యూఢిల్లీ: ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ర్యాలీలో ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్(Constable) పాల్గొన్నాడు. అయితే అతన్ని సర్వీస్ నుంచి తక్షణమే డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ ప్రదర్శనలో పాల్గొన్న నేపథ్యంలో ఆ చర్య తీసుకున్నారు. శాఖాపరమైన దర్యాప్తులో కానిస్టేబుల్ షేర్ సింగ్.. తీవ్రమైన తప్పుకు పాల్పడినట్లు తేలింది. సర్వీస్ నిబంధనలను అతను బ్రేక్ చేశాడు. పిత్తోర్ఘడ్ ఎస్పీ అక్షయ్ ప్రహ్లాద్ కొండె మాట్లాడుతూ.. క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ పోలీసు చట్టం 2007 ప్రకారం ఆ చర్యలు తీసుకున్నామన్నారు. ఆ ఆదేశాల ప్రకారం ఆయన్ను తక్షణం టర్మినేట్ చేశారు.
డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఆ కానిస్టేబుల్ ప్రవర్తన సరిగా లేదని గుర్తించామన్నారు. క్రమశిక్షణ, ప్రవర్తన సరిగా లేదని, సర్వీస్ నిబంధనలను కూడా అతను ఉల్లంఘించినట్లు పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని నిరసన ప్రదేశం వద్ద కానిస్టేబుల్ షేర్ సింగ్.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది. రాజీనామా చేస్తున్నానని, స్టేట్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో అవినీతి పెరిగినట్లు ఆరోపించారు. ఉత్తరాఖండ్ పట్వారి రిక్రూట్మెంట్ పరీక్షకు చెందిన ప్రశ్నాపత్రాన్ని పచారీ కొట్టులో అమ్మినట్లు తన ప్రసంగంలో ఆ కానిస్టేబుల్ ఆరోపించాడు. హరిద్వార్‌లో భూ ఆక్రమణకు పాల్పడినట్లు గత ఏడాది ఆ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేశారు.
पिथौरागढ़: दिल्ली के जंतर-मंतर पर छात्र आंदोलन के दौरान पुलिस वर्दी में मंच से भाषण देने वाले निलंबित कॉन्स्टेबल शेर सिंह को उत्तराखंड पुलिस ने सेवा से बर्खास्त कर दिया है।
विभागीय जांच में उनका आचरण उत्तराखंड पुलिस अधिनियम-2007 और राज्य कर्मचारी आचरण नियमावली-2002 का गंभीर…
— bhUpi Panwar (@askbhupi) August 5, 2026