నగరం నిషేధిత జాబితాలో చిక్కుకుని విలవిలలాడుతున్నది. కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తుల హక్కులు కోల్పోయి ప్రజలు అల్లాడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఏ కాలనీ చూసినా నిషేధిత జాబితాలో కొట్టుమిట్టాడుతున్నది. అన్ని ప్రభుత్వ అనుమతులతో పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు 22ఏలోకి చేరడంపై ఆయా కాలనీల ప్రజలు మనోవేదనకు గురవుతున్నారు. కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, పలు కాలనీల సొసైటీలు, లేఅవుట్లు, అపార్ట్మెంట్ల సముదాయాల ప్రజలు తమ ఇండ్లు, ఆస్తుల పరిస్థితేంటని ఆరా తీస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకుని నిర్మించుకున్న ఇండ్లపై తమకు హక్కులు లేని పరిస్థితికి వచ్చేసరికి తీవ్ర మనస్తాపం చెందుతున్నారు.
తిండి, నిద్రలకు ఓర్చుకుని కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అకారణంగా ప్రభుత్వం పేరిట చేరడంతో కలత చెందుతున్నారు. పట్టా భూముల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు అన్ని అనుమతులిచ్చిన ప్రభుత్వమే నిషేధిత జాబితాలోకి మార్చడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు అమ్ముకోలేని, కొనుక్కోలేని దుస్థితికి చేరడంపై ఆవేదన చెందుతున్నారు. దశాబ్దాల కాలం కిందట ఏర్పడిన కాలనీలను ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన పేరిట ప్రజా వంచన పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల రియల్ దందా సాగించేందుకే సామాన్య ప్రజల ఆస్తులను ప్రభుత్వ జాబితాలోకి మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో/మేడ్చల్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని కాలనీలు నిషేధిత జాబితాలో చేరడంతో ఇండ్లు, స్థలాలు కొనలేని, అమ్మలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా కాలనీల ప్రజలు ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఆస్తులను అమ్ముకుందామన్నా ప్రభుత్వ కబ్జాలో ఉండటంతో ఆగమాగమవుతున్నారు. పిల్లల చదువులు, పెండ్లిండ్ల కోసం జీవితాంతం కష్టపడి సమకూర్చుకున్న సొంత ఆస్తులను అమ్ముకోలేని దుర్భర స్థితిలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని గ్రామాలకు గ్రామాలు, కాలనీలు, హౌసింగ్ సొసైటీలు, లేఅవుట్లు, వెంచర్లన్నీ 22ఏలో చేరిన ఘటనలు ప్రజలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. హైరైజ్డ్ భవనాలు, అపార్ట్మెంట్లలోని వేలాది ఫ్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో పైసా పైసా కూడబెట్టుకుని, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని కొనుక్కున్న కలల సౌధాన్ని ప్రభుత్వం తనదంటుండటంతో వేతన జీవులు కుంగిపోతున్నారు. ఏండ్ల తరబడిగా పట్టా భూములుగా కొనసాగిన తమ స్థలాలు ఉన్నట్టుండి నిషేధిత జాబితాలోకి చేర్చడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
22ఏ నిషేధిత జాబితాలో ఉన్న తమ ఆస్తులను జాబితా నుంచి తొలగించుకునేందుకు దరఖాస్తులు చేసుకుంటే తప్ప అధికారులు పరిశీలించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ ఇప్పటికింకా ప్రైవేట్ ఆస్తుల యజమానులు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు చేసుకుంటున్నారు. దరఖాస్తులు ఇచ్చిన వాటికే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే దరఖాస్తులు చేసుకోలేని వారి ప్రజల ఆస్తులను జాబితా నుంచి తొలగించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే అత్యవసర పరిస్థితులు ఉన్నవారు తమ ఆస్తులను అమ్ముకునేందుకు దరఖాస్తులు చేసుకుంటూ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అధికారులను కోరుతున్నారు.
ప్రజల ఆస్తులను 70 శాతం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో తొలగించామని అధికారులు చెబుతున్న మాటలకు పొంతన కనపడటంలేదు. ఇదిలా ఉంటే రిజిస్ట్రేషన్ శాఖకు నిషేధిత జాబితా వివరాలను పంపినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నప్పటికీ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి తమ ఆస్తులు జాబితా నుంచి తొలగించారా.. లేదా? అన్న విషయాలను చెక్ చేసుకోనేందుకు వచ్చిన ప్రజలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా తిప్పి పంపుతున్నారు. రెవెన్యూ, రిజి్రస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

22ఏ నిషేధిత జాబితా దళారులకు పండుగగా మారింది. నిషేధిత జాబితా నుంచి తొలగించేలా తాము చూసుకుంటామని గజానికి ఇంత ఇస్తే తమ ఆస్తులు జాబితా నుంచి తొలగించేలా చూస్తామని బేరసారాలు కొనసాగుతున్నాయి. కొందరు చేసేది ఏమీలేక దళారులకు డబ్బులు ఇచ్చి తమ ఆస్తులను జాబితా నుంచి తొలగించుకుంటున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న భూమి విలువ ఆధారంగా దళారులు డబ్బులు బాధితులను అడిగి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దళారులకు కొందరు అధికారులు సహకరించడం వల్లే సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. దళారుల బాధ నుంచి తప్పించి అధికారులు 22ఏ నిషేధిత జాబితా నుంచి ప్రజల ఆస్తులను పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు.

22ఏ నిషేధిత జాబితా వ్యవహారం స్థానిక లక్ష్మీగణపతి కాలనీ భూ యజమానులను తీవ్రంగా వేధిస్తున్నది. కాలనీలోని 19 ఎకరాల్లో ఆరు ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లు మేడిపల్లి తాసీల్దార్ చెప్పారని.. దాంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే.. తమకు ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల సమన్వయ లోపం కారణంగా భూముల యజమానులు మరింత నష్టపోతున్నారు. 22ఏ పేరుతో ప్రజలకు నర కం చూపడం ఆపి, సమస్యను పరిషరించాలి.
ప్రైవేట్ ప్లాట్.. అన్ని శాఖల్లో పరిశీలించిన తర్వాతే బ్యాంకు లోన్ తీసుకుని కొన్నాం. డబ్బులు ఇచ్చేశాం.. రిజిస్ట్రేషన్ సమయానికి ప్రభుత్వ భూమి అంటూ రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తే మా పరిస్థితి ఏమిటి? బ్యాంక్ లోన్ ఎవరు కట్టాలి. ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి? అధికారుల తప్పిదమని మంత్రి సులభంగా సారీ చెప్పేశారు.. కానీ పరిషారం మాత్రం చూపలేదు. మాకు ఎలాంటి హామీ దొరకడం లేదు.
కాంగ్రెస్ ప్రభు త్వం అమాయక రైతులు, పేద, మధ్య తరగతి ప్రజల భూ ములను 22ఏలో చేర్చి బలి చేస్తున్నది. ఏండ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకొని భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తుంటే నిలువ నీడ లేకుండా చేస్తున్నది. కీసర మండలం దమ్మాయిగూడ సర్కిల్లోని కొన్ని భూములను నిషేధిత 22ఏలో చేర్చడంతో అటు రైతులు, ప్లాట్ల యజమానులు లబోదిబోమంటున్నారు. పలు కాలనీల్లో ప్లాట్లు, ఇండ్ల స్థలాలు నిషేధిత జాబితాలో పెట్టడంతో యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
22ఏ కారణంగా భూముల క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో 50 ఏండ్లుగా నివాసం ఉంటు న్నాం. మా ఇల్లు గతంలో 22ఏ పరిధిలో లేకుండే.. ఇప్పుడు చేర్చడం వలన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. యూఎల్‌సీలో లేని భూములను కూడా యూఎల్‌సీలో చేర్చారు. తద్వారా అల్పాదాయ వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. రిజిస్ట్రేషన్లు చేయ డం లేదు. ఆపదలో భూమి అమ్ముకుందాం.. అంటే అమ్మలేని దుస్థితి. ప్రభుత్వం 22ఏపై పునరాలోచన చేయాలి.
ఏండ్ల కిందటే జీహెచ్ఎంసీ ప్లాన్, అనుమతు లు తీసుకుని నిర్మించిన ఇండ్ల ను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చ డం ఎంతవరకు సమంజసం. పన్నులు కడుతున్న ఆస్తులను రాత్రికిరాత్రి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో ఇక్కడి ప్రజలంతా ఆందోళనలో మునిగిపోయారు. చట్టబద్ధమైన ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం.. రిజిస్టేషన్లు నిలిపివేయడం సరికాదు. ప్రజల హక్కులను కాలరాయడమే. కోట్లు పెట్టి ఆస్తులు కొన్న వారికి 22ఏ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది.
మల్లాపూర్ డివిజన్ నెహ్రునగర్, అశోక్‌నగర్ ప్రాం తంలోని సర్వే నం బర్ 43,44,45, 46,51ల్లోని భూ ములను ప్రభుత్వం 22 ఏలో చేర్చడం వల్ల బడుగు బలహీనవర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. 35 ఏండ్లుగా ఇక్కడ నివాసముంటున్న తమకు 1992లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ పేరుతో తీవ్ర అన్యాయం చేస్తున్నదని, వెంటనే 22ఏను ఉపసంహరించుకోవాలి. లేనియెడల ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పద్మానగగర్ ఫేస్-1 కాలనీలో 58 ఏండ్లుగా స్థిరపడిన నివాసితులకు అసోసియేషన్ పూర్తి అండగా ఉంటుంది. ఈ సర్వే నంబర్లను నిషేధిత జాబితా నుంచి తొలగించి, శాశ్వత రిజిస్ట్రేషన్ హక్కుల కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చలు జరుపుతున్నాం. ప్రజలకు పూర్తి చట్టపరమైన రక్షణ లభించేంత వరకు ఐక్యంగా పోరాటం చేస్తాం.
మేము 1969 లోనే చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నాం. కాలనీలో 70 శాతానికిపైగా భూమి 22ఏ పరిధిలోకి వెళ్లినట్లు తెలుస్తున్నది. పిల్లల పెళ్లిళ్లు, విదేశీ విద్య, వైద్య అవసరాల కోసం ఆస్తులు అమ్మాలన్నా కుదరట్లేదు. పాత రుణాలకు సంబంధించి భూమి ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. లోన్లు వెంటనే చెల్లించండి అంటూ కొంతమందికి బ్యాంకర్ల నుంచి వేధింపులు వస్తున్నాయి.
దశాబ్దాలుగా మున్సిపల్ విద్యుత్, నీటి పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. అయినప్పటికీ తమ స్థలాలను అసైన్డ్, నిషేదితా జాబితాలో చేర్చడం దారుణం. క్రయవిక్రయాలు రీ రిజిస్ట్రేషన్లు బంద్ అయ్యాయి. కొత్త గృహలకు రుణాలు రాకపోగా, ఉన్న రుణాలను వెంటనే క్లియర్ చేయాలని బ్యాంకులు ఒత్తిడి తెస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే ఈ భూములను డీ-నోటిఫై చేసి రెగ్యులరైజ్ చేయాలి.
ఎలాంటి ఆక్రమణలకు పాల్పడని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా 22ఏ నుంచి మినహయింపు ఇవ్వాలి. 1987లో సర్వే నంబర్ 128/11లో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని 1989లో మున్సిపాలిటీ అనుమతులతో ఇల్లు నిర్మించుకున్నాం. గతంలో అసైన్డ్ ల్యాండ్‌గా ఉన్న భూమి చట్టబద్ధంగా విక్రయించబడినప్పటికీ, అధికారులు డేటా అప్డేట్ చేయకపోవడమే ఈ సమస్యకు మూలం. ప్రభుత్వం తక్షణమే ఆయా భూములను 22ఏ నుంచి తొలగించాలి.
కుత్బుల్లాపూర్ ఏర్పడిన నాటి నుంచి సర్వేనంబర్ 151లో నివాసా లున్నాయి. గ్రామ పంచాయతీగా కొనసాగినప్పుడు విలువ తక్కువగా ఉండేది. విలువైన ప్రాంతంగా మారాక రిజిస్ట్రేషన్లు ఎన్నో లావాదేవీలు జరిగాయి. ఎలాంటి అభ్యంత రాలు లేనిచోట ఇప్పుడు నిషేధం విధిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తు న్నది. సుధీర్ఘకాలం పట్టా భూమిగా చూపి ఇప్పుడు ఎలా నిషేధం విధిస్తారు. ప్రభు త్వం ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలి.
సమీపంలోని కాలనీలు, బస్తీలు రికార్డుల్లో ప్రభుత్వ భూములైనా ప్రజ లు నివాసముండటంతో క్రమబద్ధీకరించారు.. యాభై ఏండ్లుగా మారుతీనగర్ ప్రాంతాలు పట్టా భూములుగా రికార్డుల్లో ఉన్నాయి. పలుమార్లు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు ఆయ్యాయి. అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు ఎన్ఓసీ తీసుకుని రిజిస్ట్ట్రేషన్లు చేశారు. చిన్నపాటి సమస్యలున్న ఈ ప్రాంతాన్ని ఇప్పుడు 22ఏ జాబితాలో చేర్చడం సరికాదు.