హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులపై అసెంబ్లీలో శుక్రవారం సుదీర్ఘ చర్చ కొనసాగింది. మంత్రి సీతక మాట్లాడుతూ ఎండలు మండిపోవడానికి, నీటి కొరత రావడానికి పసిఫిక్ మహాసముద్రంలో పుట్టిన ‘ఎల్ నినో’ మార్పులే కారణమని చెప్పారు. ఈ అంశంపై మంత్రి పొంగులేటి స్పందిస్తూ వర్షాభావానికి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న క్షుద్రపూజలేనని కారణమని బాంబు పేల్చారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను ఎదురొనడంలో కేంద్రం సహకారం అందించాలని సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి శివరాజ్సింగ్చౌహాన్ను కోరారు. దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనడానికి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
సుగంధ ద్రవ్యాలు, కాఫీ, జీడిపప్పు, కోకో, గంధం వంటి ఉద్యాన పంటల సాగుకు దక్షిణ భారతదేశంలో అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్సింగ్చౌహాన్ చెప్పారు. అన్ని రంగాల్లో తెలంగాణకు కేంద్రం సహకారం అందిస్తున్నదని తెలిపారు.