రాకా.. ప్రపంచ విజయం
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ విజువల్ డ్రామా ‘రాకా’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలయ్యేందుకు ఏడాదిపైనే సమయం పట్టొచ్చు.
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ విజువల్ డ్రామా ‘రాకా’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదలయ్యేందుకు ఏడాదిపైనే సమయం పట్టొచ్చు. అయినప్పటికీ ఈ సినిమా ప్రచారాన్ని మేకర్స్ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా ‘37’ అంటూ వారిచ్చిన పజిల్ అభిమానుల్లో ఉత్సుకత రేకెత్తించింది. వెంటనే శుక్రవారం మరో చిన్న బిట్‌ని వదిలి రానున్న ‘రాకా’ విజయంపై కాన్ఫిడెన్స్‌ని వ్యక్తం చేశారు.
‘అసాధ్యాన్ని సాధ్యం చేసేందుకు, దాన్ని సాధించేందుకు మేం సాహసించాం.. ‘రాకా’.. ఓ ప్రపంచ విజయం’ అంటూ అతిత్వరలో ఓ అప్డేట్ని రివీల్ చేయనున్నట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి ఇంకొన్ని రోజుల్లోనే ‘రాకా’ ప్రపంచం తాలూకు గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉన్నదని చెప్పొచ్చు. దీపిక పడుకోన్, మృణాల్‌ఠాకూర్, జాన్వీ కపూర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

