Hydraa | హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 ఇంటర్ కాలేజీలపై కేసు నమోదు
హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఫైర్ ఎన్ఓసీలు) సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన అధికారులు 8 ప్రైవేటు జూనియర్ కాలేజీలపై కేసు నమోదు చేశారు
Hydraa | హైదరాబాద్, ఆగస్టు 5: హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (ఫైర్ ఎన్ఓసీలు) సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన అధికారులు 8 ప్రైవేటు జూనియర్ కాలేజీలపై కేసు నమోదు చేశారు.
ప్రాథమిక విచారణలో హైడ్రా పేరుతో రూపొందించిన నకిలీ ఫైర్ ఎన్ఓసీలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ పత్రాల ఆధారంగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది.
ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయడంతో లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బీఎన్ఎస్ సెక్షన్లు 337, 336(3), 340(2), 318(4), 3(5) కేసు నమోదు చేశారు. దర్యాప్తులో తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ఆర్ నగర్, మెహిదీపట్నం, బర్కత్‌పురా ప్రాంతంలోని 8 ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇదే తరహాలో సమర్పించిన మరో 60 ప్రైవేటు కాలేజీ ఫైర్ ఎన్ఓసీలను కూడా అధికారులు స్క్రూటినీ చేస్తున్నారు. వాటి ప్రామాణికతపై విచారణ కొనసాగుతోందని, దర్యాప్తులో మరిన్ని అక్రమాలకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

