‘మెటా’ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి
నాలెడ్జ్ సిటీలోని స్కై వ్యూ బహుళ అంతస్థుల వాణిజ్య సముదాయంలో ఉన్న మెటా కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జకిడి శివచరణ్‌రెడ్డి దాడికి దిగారు.
- హైదరాబాద్‌లో అధికార పార్టీ అరాచక కాండ
- సోషల్‌మీడియా ఖాతాల నిలిపివేతపై దౌర్జన్యం
- స్కైవ్యూ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం
- 21 మంది యువజన కాంగ్రెస్ నేతల అరెస్ట్
కొండాపూర్, నవంబర్ 20 : నాలెడ్జ్ సిటీలోని స్కై వ్యూ బహుళ అంతస్థుల వాణిజ్య సముదాయంలో ఉన్న మెటా కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జకిడి శివచరణ్‌రెడ్డి దాడికి దిగారు. తన అనుచరులతో కలిసి శుక్రవారం సంస్థ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్ల్లేందుకు ప్రయత్నించారు. జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్భానుతోపాటు ఇన్చార్జ్ మణిశర్మ సోషల్ మీడియా ఖాతాలను మెటా సంస్థ నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.
మెటాకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సంస్థ ప్రాంగణంలోని పూల కుండీలను పగలగొడుతూ హల్చల్ చేశారు. నిలిపివేసిన ఖాతాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు అక్కడికి చేరుకొని 21 మంది కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని, కాసేపటికి వదిలేశారని సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

