ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) బీహార్ ఎన్నికల ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభల్లో ఖాళీ కుర్చీలు కనిపించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఎద్దేవా చేశారు. ఆదివారం ముంబైలోని తన నివాసం మాతోశ్రీలో ‘అమ్దార్ చషక్’ లోగోను ఉద్ధవ్ ఠాక్రే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య సారాంశాన్ని దెబ్బతిస్తున్నారని ఎన్డీయేపై మండిపడ్డారు.
కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తావించారు. విజేతలకు అభినందనలు తెలిపారు. అయితే ఫలితాల పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రి గతంలో ‘జో జీతా వహీ సికందర్’ అని చెప్పారు. కానీ ‘సికందర్’ అంటే నిజంగా ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు’ అని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ర్యాలీలను ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తావించారు. ఆయన సభల్లో కనిపించిన భారీ జనసమూహం నిజమైనదా లేదా ‘ఏఐ’ ద్వారా సృష్టించారా? అని ప్రశ్నించారు. ‘భారీ జనసమూహాన్ని పొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఖాళీ కుర్చీలను ఆకర్షించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్యం లెక్క ఇది. దీనిని అర్థం చేసుకోవడం కష్టం’ అని వ్యాఖ్యానించారు.
బీహార్లో చేపట్టిన ‘సర్’ ప్రక్రియను ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. తొలగించిన ఓటర్లను జాబితాలో నిజంగా చేర్చారో లేదో తెలియదని అనుమానం వ్యక్తం చేశారు. ‘ఎన్నికలకు మేం వ్యతిరేకం కాదు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి జీవనాడి. కానీ ఆ జీవనాడిపై దాడి జరిగితే, మనం దానిని ప్రజాస్వామ్యం అని ఎలా పిలువగలం? అని ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీలను అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు.
Mumbai: On NDA’s victory in the #BiharAssemblyElections, Shiv Sena (UBT) Chief Uddhav Thackeray says, “In a democracy, the winner is considered the victor, and the winner should be congratulated. We also extend our greetings to Nitish Kumar for his win. However, I have serious… pic.twitter.com/soOEMjoKfc
— IANS (@ians_india) November 16, 2025
Also Read:
Lalu Yadav’s 3 daughters Left | రోహిణి ఆచార్య తర్వాత.. లాలూ నివాసాన్ని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు
Tej Pratap | నా సోదరికి జరిగిన అవమానం భరించలేనిది: తేజ్ ప్రతాప్