హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నిరుపేదల గుడిసెలను బుల్డోజర్లతో కూల్చివేస్తుండటంతో వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నమ్మి గెలిపిస్తే మా కొంపలు కూల్చారని బాధితులు శపనార్ధాలు పెడుతున్నారు. తాజాగా ఖమ్మం శివారులోని వెలుగుమట్ల భూదాన భూమి వద్ద గుడిసెలను అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్యన కూల్చివేస్తున్నారు. సుమారు 3 వేల మంది పోలీసులను రంగంలోకి దింపి బలవంతంగా గుడిసెలను తొలగిస్తున్నారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..రేవంతన్న, సీనన్న అని ఓటు వేసి గెలిపించి గద్దె మీద కూర్చోబెడితే మమ్మల్ని ఇవాళ రోడ్డు మీదకు లాగారు. సంవత్సరం నుండి కరెంటు లేదు, నీళ్లు లేవు. ఒకరోజు తిని ఒకరోజు తినక ఉంటున్నాము. ఏనిమిదేండ్లుగా నివసిస్తుంటే ఇప్పుడు వెళ్లి పొమ్మంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. డబ్బులు తీసుకోకుండా కాంగ్రెస్కు ఓటేస్తే తగి న బుద్ధి చెప్పరన్నారు. గుడెసెలు కూల్చి మా బతుకులు ఆగం చేయొద్దని ప్రాధేయపడుతున్నారు.
రేవంతన్న, సీనన్న అని ఓటు వేసి గెలిపించి గద్దె మీద కూర్చోబెడితే మమ్మల్ని ఇవాళ రోడ్డు మీదకు లాగారు
సంవత్సరం నుండి కరెంటు లేదు, నీళ్లు లేదు.. ఒకరోజు తిని ఒకరోజు తినక ఉంటున్నాము అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఖమ్మం కలెక్టరేట్ ప్రాంతంలో ఇండ్లు కోల్పోతున్న బాధితులు https://t.co/APl0U2cA8f pic.twitter.com/sosOffxFxb
— Telugu Scribe (@TeluguScribe) February 24, 2026