Snow Storm | అమెరికాలో మంచు తుఫాను తీవ్ర రూపం.. వేలాది విమాన సర్వీసులు రద్దు
Snow Storm | అమెరికా (USA) లో మంచు తుఫాను (Snow Storm) తీవ్ర రూపం దాల్చింది. ఈశాన్య ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. దాంతో లక్షలాదిగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. మంచు తుఫాను, బలమైన ఈదురు గాలుల కారణంగా రవాణా కష్టంగా మారింది.
Snow Storm : అమెరికా (USA) లో మంచు తుఫాను (Snow Storm) తీవ్ర రూపం దాల్చింది. ఈశాన్య ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. దాంతో లక్షలాదిగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. మంచు తుఫాను, బలమైన ఈదురు గాలుల కారణంగా రవాణా కష్టంగా మారింది. వేలాది విమన సర్వీసులు రద్దయ్యాయి.
తుఫాను తీవ్రత దృష్ట్యా విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు ముందుగానే ప్రకటించాయి. శనివారం నుంచి మంగళవారం మధ్య 10 వేల కంటే ఎక్కువ విమాన సర్వీసులు రద్దయినట్లు విమానాల ట్రాకింగ్ సర్వీస్ ‘ఫ్లైట్ అవేర్’ పేర్కొన్నది. ఇందులో సోమవారమే 5 వేల కంటే ఎక్కువ రద్దయ్యాయని తెలిపింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే, లగ్వార్డియా విమనాశ్రయాలు, బోస్టన్ లోగన్, నెవార్క్ లిబర్టీ నుంచి రాకపోకలు సాగించాల్సినవే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
పలు రాష్ట్రాల్లో రైలు, బస్ సేవలు కూడా నిలిచిపోయాయి. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్కులో 15 అంగుళాల కంటే ఎక్కువ మంచు కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో రెండు అడుగులకుపైనే మంచు పేరుకుపోయింది. ఈ భారీ హిమపాతం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దాంతో లక్షలాది ఇళ్లు, వ్యాపార సముదాయాలు అంధకారంలో చిక్కుకుపోయాయి. విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

