వాషింగ్టన్, మార్చి 1: ‘చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకడైన ఖమేనీ మరణించాడు’ అని ట్రంప్ తర సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది ఒక్క ఇరాన్ ప్రజలకే కాదు అమెరికన్లు, ప్రపంచ వ్యాప్తంగా ఖమేనీ, అతని రక్తపిపాస ముఠాల చేతిలో హతమైన వారి కుటుంబాలు, బాధిత ప్రజలకు జరగిన న్యాయం అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. అతను, అతనితో పాటు ఉన్న నేతలు మమ్మల్ని ఏమీ చేయలేకపోయారన్నారు. ఇరాన్‌పై భారీ, కచ్చితమైన బాంబు దాడులు వారం పొడవునా, తరువాత కూడా జరుగుతాయని ఆయన హెచ్చరించారు.
ఆ దేశం అణు సామర్థ్యాలను నిలిపివేయడానికి అవసరమైన ప్రాణాంతక దాడిలో భాగంగా ఇది చేశామని అమెరికా తన చర్యను సమర్థించుకుంది. అమెరికా-ఇరాన్ జరిపిన సంయుక్త దాడుల్లో ఒక్క దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలు మరణించారని డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. తాము చేపట్టిన ఆపరేషన్ ఎన్నో రెట్లు విజయవంతమైందని, ఊహించిన దానికన్నా వేగంగా ఫలితాలు వచ్చాయని అన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడి షెడ్యూల్ కన్నా ముందే జరిగిందని, అయితే చాలా మంచి ఫలితాలు వచ్చాయని ఆయన చెప్పారు.