Ragging | అదనపు చపాతీ అడిగినందుకు వాతలు.. పెద్దేముల్ గురుకులంలో విద్యార్థిపై సీనియర్ల దాష్టీకం
Ragging | తాండూరు పట్టణంలోని విజయనగర్కాలనీలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల ( పెద్దేముల్)లో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. ఆదివారం విద్యార్థులను చూసేందుకు తల్లిదండ్రులు రాగా ఈ ఉదంతం వెలుగు చూసింది.
Ragging | తాండూరు/పెద్దేముల్ ఆగస్టు 16: తాండూరు పట్టణంలోని విజయనగర్కాలనీలోని తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల ( పెద్దేముల్)లో ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది. ఆదివారం విద్యార్థులను చూసేందుకు తల్లిదండ్రులు రాగా ఈ ఉదంతం వెలుగు చూసింది.
తాండూరు నియోజకవర్గం అగ్గనూర్కు చెందిన బాలాజీ (8వ తరగతి) తండ్రి చనిపోవడంతో స్థానిక బాలుర గురుకుల పాఠశాలలో తల్లి చేర్పించింది. శనివారం భోజన సమయంలో అదనపు చపాతీ అడిగినందుకు సీనియర్ విద్యార్థులు లోకేశ్ , మణికంఠ చపాతీ పెంకతో తన కాళ్లపై కాల్చారని బాలాజీ ఆరోపించాడు. బాలాజీకి జ్వరం వచ్చిందని ఉపాధ్యాయులు ఫోన్ చేశారని, పాఠశాలకు వస్తే ఈ విషయం బయటపడిందని విద్యార్థి తల్లి వాపోయింది. సమాచారం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా ఎలాంటి విచారణ చేయక పోవడం గమనార్హం.
తనను పాఠశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నాడని బాధిత విద్యార్థి ఆరోపించాడు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. పాఠశాలలో ర్యాగింగ్ జరుగుతున్నా ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోక పోవడంవల్లే ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

