AP News : ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లోని రాజమహేంద్రవరం (Rajamahendravaram) లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంజినీర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నదిలో దూకి ఆత్మహత్య (Suicide) కు పాల్పడ్డాడు. రాజమహేంద్రవరంలోని రైల్వే బ్రిడ్జి (Railway Bridge) పైనుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వారు నదిలో దూకేశారు.
ఆ ఇంజినీర్ పిఠాపురానికి చెందిన వ్యక్తి అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే నలుగురు నదిలో దూకినా ఒకరు ప్రాణాలతో బయపడ్డారు. ఈత రావడంతో ఇంజినీర్ కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. స్థానికులు అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మిగతా వారి కోసం పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.