Virat Kohli | నాకు ఇదే చివరి వరల్డ్‌కప్.. ఆ విషయాన్ని అసలు పట్టించుకోను..!
Virat Kohli : కెరీర్లో చివరి ప్రపంచకప్ ఆడబోతున్న మాజీ సారథి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. శంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌పై దృష్టి సారించిన కోహ్లీ మెగా టోర్నీకి తాను సదా సిద్ధంగా ఉన్నానని అన్నాడు.
Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడడంపై ఎవరికీ సందేహాలు లేవు. ఫామ్, ఫిట్నెస్ రీత్యా పటిష్టంగా ఉన్న విరాట్ మరోసారి భారత జట్టు విజయాల్లో కీలకం అవుతాడని మాజీ ఆటగాళ్లు, అభిమానులు విశ్వసిస్తన్నారు. కెరీర్లో చివరి ప్రపంచకప్ ఆడబోతున్న మాజీ సారథి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాడు. శంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌పై దృష్టి సారించిన కోహ్లీ మెగా టోర్నీకి తాను సదా సిద్ధంగా ఉన్నానని అన్నాడు. తిరువనంతపురంలో తొలి మ్యాచ్‌కు ముందు కోహ్లీ మాట్లాడుతూ తన సన్నద్ధతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘దేశం తరుఫున నేను ఆడబోతున్న చివరి వరల్డ్‌కప్ ఇదే. ఇంతకంటే ప్రేరణ ఇంకేం కావాలి’ అని వెల్లడించాడీ రన్ మెషీన్.
కెరీర్ చరమాంకంలో ఉన్న విరాట్ కోహ్లీ మరో ప్రపంచకప్ లక్ష్యంగా సాగుతున్నాడు. వన్డేల్లో గొప్పగా ఆడుతున్న విరాట్ 2027 వరల్డ్‌కప్‌లో చెలరేగిపోవాలని భావిస్తున్నాడు. మెగా టోర్నీకి సన్నాహకంగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతున్న కోహ్లీ తనకు ఇదే చివరి వరల్డ్‌కప్ అని పేర్కొన్నాడు.
Virat Kohli taking the spinners apart during the practice session ahead of the West Indies series 🔥🥶 pic.twitter.com/JUtKWYtpcU
— Indian Cricket Ministry (@Tejashyyyyyy) September 26, 2026
‘నేను భారత జట్టు తరఫున ఆడనున్న చివరి వరల్డ్‌కప్. ఇంతకంటే ప్రేరణ ఇంకేం కావాలి. ఇంకా చెప్పాలంటే వరల్డ్‌కప్ గెలుపొందడమే మా టార్గెట్. అయితే.. మెగా టోర్నీలో ఎంత వరకు వెళ్లినా సరే. అందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని విరాట్ తెలిపాడు. కెరీర్లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్నందున ఒత్తిడి, అంచనాలు ఉండడం సహజమేనని అంగీకరించిన కోహ్లీ.. తాను మాత్రం స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు.
Virat Kohli is “absolutely ready” for 2027 pic.twitter.com/1ym2gI1rFE
— Cricinfo (@cricinfo) September 26, 2026
‘ఇప్పుడు ఆట పరంగా ఏం మారిందంటే.. నేను స్వేచ్ఛగా ఆడాలనుకుంటున్నా. నాపై అభిమానులు పెట్టుకున్న అంచనాల గురించి ఇక ఆందోళన చెందను. చాలా ఏళ్లుగా జట్టులో నా పాత్ర ఏంటో నాకు తెలుసు. మిడిలార్డర్‌కు స్థిరత్వం తీసుకురావడాన్ని కొనసాగిస్తాను. ఆటలో వైవిధ్యం చూపేందుకు నేను కృషి చేస్తా. అప్పుడు మనకు 30- 40 పరుగులు వస్తాయి. అలాఅని రిస్క్ తీసుకోను. ఇన్నింగ్స్ మధ్యలో అవసరాన్ని బట్టి దూకుడు.. సంయమనం పాటించడం ముఖ్యమని నాకు తెలుసు. ఇటీవల వన్డేల్లో ఆట చాలా మారిపోయింది. చాలా జట్లు 340 నుంచి 350 రన్స్ కొడుతున్నాయి.
అలాంటప్పుడు మనం కూడా 350 నుంచి 360 కొట్టాలి. నేను క్రీజులో ఉండి రిస్క్ తీసుకుంటే భారత జట్ట అలవోకగా 360కి పైగా స్కోర్ చేస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్లనే ఇటీవల స్వేచ్ఛగా ఆడుతున్నా’ అని విరాట్ వెల్లడించాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికగా వరల్డ్‌కప్ జరుగనుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 21 వరకు ఈ ఐసీసీ మెగా ఈవెంట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

