KTR | ఎక్కడ పోయినా దేఖ్ లేంగే అంటుర్రు.. కేసీఆర్ అంటున్నరు : కేటీఆర్
KTR | ఒక ఆడపల్లి పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తున్న ఒకేఒక్క నాయకుడు కేసీఆర్ అని వాళ్ల తల్లిదండ్రులు ప్రతీ రోజూ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్నప్పుడల్లా కేసీఆర్ను ఒక మేనమామలాగా కేసీఆర్ యాది చేసుకుంటున్నరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు.
KTR | గణేశుల పండుగొచ్చింది.. ఏమైంది.. ఊరూరుకి ఏం నడుస్తుంది.. ఎక్కడ పోయినా ఏ పేరు వినబడుతోంది. దేఖ్ లేంగే అంటుర్రు.. కేసీఆర్ అంటున్నరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూడేళ్లు పెద్ద మనిసి కనబడకపోయినా.. కేసీఆర్ బయటకు రా అని కాంగ్రెసోళ్లు అడుగుతా ఉంటరు కదా.. కేసీఆర్ ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నడు అనే మాట. మా పిల్లలే చెప్పారు. ఇవాళ రూ.2 వేలు పెన్షన్ అందుకుంటున్న 46 లక్షల మంది మా తల్లులు, మా పెద్ద మనుషులు కేసీఆర్కు రోజూ దీవెన పెడుతున్నరు. 200 రూపాయలుండే కొడుకా కేసీఆర్ రూ.2 వేలు చేసిండు. వీళ్లన్నీ లంగమాటలు చెప్పిర్రు.. ఏం చేయలేదు. ఇవాళ పాత రూ.2 వేలే వస్తున్నయని ప్రతీ తల్లి, పెద్ద మనిషి కేసీఆర్ను ఆశీర్వదిస్తున్నరు. అదేవిధంగా కేసీఆర్ ఇంటింటికీ నల్లా పెట్టి నీళ్లిచ్చిండు. ఆ నీటి బొట్టులో కేసీఆర్ రోజూ మా ఆడబిడ్డలకు కనబడుతున్నడు. మాకు బిందెలు, కుండలు తీసుకొని యుద్దాలు చేసే పరిస్థితి తప్పించిండు కేసీఆర్.. మా ఇంట్లోకి నీళ్లొస్తున్నయి.. నీటి బొట్టులో కేసీఆర్ ఉన్నడని మా ఆడబిడ్డలు రోజూ ఆశీర్వాదం ఇస్తున్నారని స్పష్టం చేశారు.
ఒక ఆడపల్లి పెళ్లి అయితే లక్ష రూపాయలు ఇస్తున్న ఒకేఒక్క నాయకుడు కేసీఆర్ అని వాళ్ల తల్లిదండ్రులు ప్రతీ రోజూ కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్నప్పుడల్లా కేసీఆర్ను ఒక మేనమామలాగా కేసీఆర్ యాది చేసుకుంటున్నరని కేటీఆర్ గుర్తు చేశారు. అట్లాగే బ్రహ్మాండంగా గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఎక్కడ డోర్నకల్, మహబూబాబాద్.. ఎక్కడ గోదావరి.. కాళేశ్వరం ద్వారా ఆ నీళ్లను తీసుకొచ్చి బ్రహ్మాండంగా కోదాడ, సూర్యాపేట దాకా అద్భుతంగా కేసీఆర్ నీళ్లించని ఎక్కడిక్కడ రైతులు యాది చేసుకుంటున్నరన్నారు.
రేవంత్ రెడ్డి రైతు బంధు ఎగ్గొట్టిన ప్రతీసారి కేసీఆర్ను యాది చేసుకుంటున్నరు. సార్ ఉన్నప్పుడు టింగ్ టింగ్మని టైంకు డబ్బులు పడుతుండే. నాట్లు వేసే టైంకు పడుతుండే. మరి ఇప్పుడెంట్లుందిరా నాయనా అంటే ఎప్పుడు పడ్తదో తెల్వది.. రేవంత్ రెడ్డి వచ్చినంక ఎకరానికి పైసలిస్తే దానికో మీటింగ్.. ఎకరానికి పైసలిచ్చుడు ఏదో గొప్ప అన్నట్టు.. అదేదో చేయలేని పని ఏదో చేసినట్టు మీటింగ్ పెట్టుడు.. అందులో ఏముంటది.. కేసీఆర్ను తిట్టుడు..బాగా నోటి తీట తీర్చుకునుడు మళ్లీ పోవుడు.. గంతే తప్ప చేసిందేమి లేదన్నారు.
గణేష్ నిమజ్జనాల్లో ఎటు చూసినా దేక్ లెంగే పాటలు, కేసీఆర్ గారి పేరు తలుచుకోవడమే కనిపించింది
కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం
– కేటీఆర్ https://t.co/pcLPfsnkwE pic.twitter.com/KHxogRMfkI
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2026
Read Also :
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS leaders
- Hyderabad
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
ఆధునిక వ్యవసాయంపై జపాన్లో కలెక్టర్ అంకిత్ అధ్యయనం
‘అర్హులైన చేనేత కార్మికులందరికీ పింఛన్లు ఇవ్వాలి’
Health tips | కాలేయం పనితీరును మెరుగుపర్చే ఈ ఆహారపదార్థాల గురించి మీకు తెలుసా..?
Delhi Police: జర్నలిస్టుల బెనిఫిట్స్.. రీల్మేకర్స్కు వర్తించవు: సుప్రీంలో ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

