Premanand Maharaj | ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడు ఆత్మహత్య.. బిల్డింగ్ పైనుంచి దూకి
Premanand Maharaj : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడు దీపక్ కుమార్ అలియాస్ రసిక్ దులారి శరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆశ్రమం బిల్డింగ్ నాలుగో అంతస్తు పై నుంచి దూకి శుక్రవారం దీపక్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.
Premanand Maharaj : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ శిష్యుడు దీపక్ కుమార్ అలియాస్ రసిక్ దులారి శరణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తర ప్రదేశ్, మధుర పరిధి, వృందావన్లోని ఆశ్రమం బిల్డింగ్ నాలుగో అంతస్తు పై నుంచి దూకి శుక్రవారం దీపక్ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. బిల్డింగ్పై నుంచి దూకిన అతడిని సన్నిహితులు వెంటనే స్థానిక సర్వోదయ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమంగా ఉంది.
దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దీపక్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి ఆశ్రమ నిర్వాహకులు వృందావన్ కొట్వాలి పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. ఈ ఘటన గురించి స్థానిక ఎస్పీ విజయ్ కుమార్ కూడా ఆరా తీశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దీపక్ అలియాస్ రసిక్ దులారి శరణ్.. జబల్పూర్ నుంచి వచ్చి, ఆశ్రమంలో ఉంటున్నాడు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులతో, ఆయన శిష్యులలో ఒకడిగా కొనసాగుతున్నాడు. ఏడాదిన్నర కాలంగా ఆశ్రమం దగ్గరలో ఉన్న సొసైటీ బిల్డింగ్లోని ఒక ఫ్లాట్లో ఉంటున్నాడు.
అయితే, అతడు ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలపై స్పష్టత లేదు. ఎందుకు దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆశ్రమ నిర్వాహకులతోపాటు సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో ఆశ్రమంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై అటు ప్రేమానంద్ మహారాజ్ కానీ, ఇటు ఆశ్రమ నిర్వాహకులు కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీపక్ మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం తగిన వివరాలు వెల్లడిస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

