Collector Ch. Priyanka | వారసత్వ సంపదను కాపాడుకుందాం : కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
Collector Ch. Priyanka | భారత వారసత్వ సంపదను కాపాడుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక సూచించారు.
మాగనూర్ కృష్ణ : భారత వారసత్వ సంపదను ( Heritage ) కాపాడుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Collector Ch. Priyanka ) సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని కృష్ణ మండలం ముడుమాల గ్రామంలో 3,500 సంవత్సరాల నాటి చారిత్రక నిలువురాళ్ల వద్ద శనివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆమె మాట్లాడుతూ ముడుమాలలోని నిలువురాళ్లు వేల సంవత్సరాల చరిత్రకు, ఖగోళ పరిజ్ఞానానికి ప్రతీకగా నిలుస్తున్నాయని అన్నారు. ఇంతటి విలువైన వారసత్వ సంపద నారాయణపేట జిల్లాలో ఉండటం ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన విషయమని పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు, వాటికి విస్తృత గుర్తింపు తీసుకురావచ్చని వెల్లడించారు.
ముడుమాల నిలువురాళ్లకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. డెక్కన్ హెరిటేజ్ సంస్థకు చెందిన ప్రొఫెసర్ ప్రవీణ్ నిలువురాళ్ల చారిత్రక ప్రాధాన్యత, వాటి వెనుక ఉన్న ఖగోళ సంబంధిత అంశాలను వివరించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ గోవిందరాజులు , డీపీఆర్వో రషీద్, యంగ్ టూరిజం క్లబ్ నోడల్ అధికారి గోవర్ధన్ గౌడ్, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఎంఈవోలు నిజాముద్దీన్, జనార్దన్ రెడ్డి, జీహెచ్ఎంలు వెంకటయ్య, ప్రదీప్ కుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వై. జనార్దన్ రెడ్డి, మండల అధ్యక్షుడు శేఖర్, ముడుమాల, మురారిదొడ్డి గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, పర్యాటక శాఖ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఎన్హెచ్ఎం ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు : కేటీఆర్
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

