Asian Games | కబడ్డీలో పసిడి కూత.. తొమ్మిదోసారి విజేతగా భారత్..!
Asian Games : ఆసియా క్రీడల కబడ్డీలో భారత జట్టు పసిడి పతకంతో గర్జించింది. మహిళలు స్వర్ణంతో మురిసిన కాసేపటికే పురుషుల జట్టు సైతం కనకంతో యావత్ భారతావనిని పులకింపజేసింది.
Asian Games : ఆసియా క్రీడల కబడ్డీలో భారత జట్టు(Team India) పసిడి పతకంతో గర్జించింది. మహిళలు స్వర్ణంతో మురిసిన కాసేపటికే పురుషుల జట్టు సైతం కనకంతో యావత్ భారతావనిని పులకింపజేసింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే ఎనిమిదిసార్లు గోల్డ్ మెడల్ సాధించిన ‘మెన్ ఇన్ బ్లూ’ మరో విజయంతో తొమ్మిదో పుత్తడిని కొల్లగొట్టింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో ఇరాన్‌ను చిత్తు చేసిన అనంతరం భారత ఆటగాళ్లు త్రివర్ణ పతాకాన్ని చేబూని మ్యాట్‌పై పరుగెట్టారు. విజయానందంలో జట్టు సభ్యులు, కోచ్‌లు కేరింతలు కొట్టారు.
జపాన్ ఆతిథ్యమిస్తున్న ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్లు పంజా విసిరాయి. కబడ్డీ కూతలో.. ఉడుం పట్టులో తమకు తిరుగులేదని చాటుతూ మహిళలు, పురుషుల విభాగంలో స్వర్ణం కైవసం చేసుకున్నాయి. శనివారం ఫైనల్లో ఇరాన్‌ను చిత్తు చేసి మహిళల జట్టు గోల్డ్ మెడల్ అందుకోగా.. కాసేపట్లోనే పురుషుల జట్టు సైతం పసిడిని ఒడిసిపట్టింది. ఫైనల్లో 40-34తో ఇరాన్‌ను ఓడించిన మెన్ ఇన్ బ్లూ గోల్డ్ మెడల్ అందుకుంది.
GOLDEN FINISH FOR BHARAT!
Congratulations to Team India’s Men’s Kabaddi Team on winning the Gold Medal at the #AsianGames2026 and successfully defending their title.
What a magnificent performance by our champions!
Proud of you all!#Cheer4Bharat pic.twitter.com/VWEwW9nz4k— Kiren Rijiju (@KirenRijiju) September 26, 2026
రెండో అర్ధ భాగంలో..
తొలి అర్ధ భాగంలో 17-18తో వెనకడిన భారత్.. అనంతరం మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తీసుకుంది. కెప్టెన్, రైడర్ సునీల్ కుమార్ ఇరాన్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ పాయింట్లు తీసుకొచ్చాడు. దాంతో.. ఇప్పటికే ఎనిమిది సార్లు ఆసియాడ్‌లో విజేతగా నిలిచినరికార్డు స్థాయిలో తొమ్మిదోసారి స్వర్ణాన్ని పట్టేసింది. అంతే.. భారత ఆటగాళ్లు మువ్వన్నెల జెండాను పట్టుకొని.. మ్యాట్‌పై పరుగులు తీసి ఈ థ్రిల్లింగ్ విజయాన్ని ఆస్వాదించారు.
The Indian Women’s Kabaddi team defends their crown in a thrilling 37-34 victory over Iran to secure Gold for the 4th time! 👑🔥
Watch the 20th Asian Games Aichi-Nagoya 2026, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames… pic.twitter.com/j4WoP9hYoX
— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2026
తొలిసారి బీజింగ్ (1990)లో గోల్డ్ మెడల్ సాధించిన భారత పురుషుల జట్టు.. 1994(హిరోషియా), 1998(బ్యాంకాక్), 2002(బుసాన్), 2006(దోహా), 2010(గంగ్జౌ), 2014(ఇంచియాన్), 2023(హంగ్జౌ), ఇప్పుడు నగోయలో పసిడి కాంతులు విరజిమ్మింది. అంతకుముందు పుష్ప రానా సారథ్యంలోని మహిళల జట్టు ఇరాన్‌ను 37-34తో ఓడించింది. తద్వారా ఆసియా క్రీడల్లో నాలుగో స్వర్ణం సొంతం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Dasara holidays | గతంలో 10 రోజులు సెలవులు.. ఇప్పుడు కేవలం రెండు రోజులే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

