శ్రీనగర్: ఉగ్రవాదంపై దర్యాప్తు కోసం డ్రై ఫ్రూట్స్ విక్రేతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రశ్నించిన తర్వాత అతడ్ని వదిలేశారు. అయితే ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Dry Fruit Seller Dies Over Terror Probe) జమ్మూకశ్మీర్‌లోని ఖాజీగుండ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇటీవల వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు ఛేదించారు. డాక్టర్ల ముసుగులో కొందరు వ్యక్తులు ఉగ్రవాద కుట్రకు పాల్పడటం తొలుత హర్యానాలోని ఫరీదాబాద్‌లో బయపడింది. నిందితుడైన డాక్టర్ అదీల్ రాథర్‌ను ఉత్తర ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా డాక్టర్ అదీల్ పొరుగున నివసించే డ్రై ఫ్రూట్స్ విక్రేత బిలాల్ అహ్మద్ వాని, అతడి కుమారుడు జిస్రార్ బిలాల్‌ను జమ్ముకశ్మీర్ పోలీసులు ఆదివారం కస్టడీలోకి తీసుకున్నారు. ప్రశ్నించిన తర్వాత బిలాల్ అహ్మద్‌ను వదిలేశారు.
మరోవైపు ఉగ్రవాదంపై పోలీసుల విచారణ తర్వాత ఖాజీగుండ్‌కు చేరుకున్న బిలాల్ అహ్మద్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా కాలిన గాయాలైన అతడ్ని శ్రీనగర్‌లోని హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. అయితే అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది తెలియలేదు.
కాగా, మృతుడు బిలాల్ అహ్మద్ కుమారుడు జిస్రార్ బిలాల్‌ను మరింతగా ప్రశ్నించేందుకు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉంచారు. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసు కీలక నిందితుడు డాక్టర్ అదీల్ సోదరుడైన డాక్టర్ ముజఫర్ కూడా కీలక కుట్రదారుడిగా పోలీసులు పరిగణిస్తున్నాడు. ప్రస్తుతం అతడు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్నట్లు సమాచారం.
Also Read:
Fake Nandini Ghee | నకిలీ ‘నందిని’ నెయ్యి రాకెట్ గుట్టురట్టు.. జంతువుల కొవ్వు వాడకంపై దర్యాప్తు
Boy Trapped In Car Dies | ఆడుకుంటూ కారులో చిక్కుకున్న బాలుడు.. రెండు రోజుల తర్వాత మృతదేహం గుర్తింపు
Watch: ఖరీదైన కారులో వచ్చి.. వార్తాపత్రికను దొంగిలించిన వ్యక్తి